సాధారణంగా సినిమాలో ఇద్దరు స్టార్స్ ఉంటేనే చూసేందుకు రెండు కళ్లు చాలవు. అలాంటిది జైలర్‌లో ఒకరిద్దరు కాదు, అనేకమంది స్టార్స్ ఉన్నారు. కన్నడ నుంచి శివ రాజ్‌కుమార్, మలయాళం నుంచి మోహన్ లాల్, బాలీవుడ్ నుంచి జాకీ ష్రాఫ్.. ఇలా వివిధ భాషల నుంచి వేర్వేరు స్టార్స్‌ను తీసుకువచ్చారు. డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ ప్రయత్నం సక్సెస్ అయింది. ఎవరి ప్రాధాన్యతను తగ్గించకుండా అందరికీ సమన్యాయం చేస్తూ అందరి ఫ్యాన్స్‌ను ఖుషీ చేశాడు డైరెక్టర్.
విలన్‌గా ఈయన చేయాల్సింది కాదు
ఇకపోతే ఈ సినిమాలో విలన్ వర్మాన్ పాత్ర కూడా బాగా పండింది. నటుడు వినాయకన్ ఈ పాత్రకు సరిగ్గా సెట్టయ్యాడు. అయితే విలన్ పాత్ర ఈయన చేయాల్సింది కాదట! మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి చేయాల్సిందట! ఈ విషయాన్ని జైలర్‌లో రజనీ కొడుకుగా నటించిన వసంత రవి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. మమ్ముట్టి సర్‌ను విలన్‌గా అనుకున్నారు. రజనీకాంత్ సరే సెట్‌లో ఈ విషయాన్ని బయటపెట్టాడు. కానీ మమ్ముట్టికి అలాంటి పాత్ర ఇవ్వడానికి ఆయనకు మనసొప్పలేదు.
మమ్ముట్టికి అలాంటి పాత్రనా? బాధపడ్డ రజనీ
నెగెటివ్ పాత్రలో తనను ఊహించుకోలేకపోయాడు. ఆయనే స్వయంగా మమ్ముట్టి సర్‌కు ఫోన్ చేసి మనం ఇది కాకుండా మరో సినిమాలో కలిసి నటిద్దాం అని చెప్పాడు. అలా ఆయన విలన్‌గా చేయలేదు అని పేర్కొన్నాడు. ఇకపోతే మమ్ముట్టి ప్రస్తుతం భ్రమయుగం అనే సినిమా చేస్తున్నాడు. రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను వైనాట్ స్టూడియోస్, నైట్ షిఫ్ట్ స్డూడియోస్‌ల సమర్పణలో ఎస్. శశికాంత్, చక్రవర్తి రామచంద్ర నిర్మిస్తున్నారు. మలయాళం, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో వచ్చే ఏడాది ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు.
చదవండి: జైలర్‌లో డ్యాన్స్ చేసిన వ్యక్తి ఎవరో తెలుసా? ఫేమస్ అవ్వడానికి ముందే గదిలో శవమై..
Comments
Please login to add a commentAdd a comment