జాతీయ అవార్డుల కోసం 300 చిత్రాల వరకు పోటీ.. కానీ అందులో ఒక్కటంటే ఒక్కటి కూడా మమ్ముట్టి సినిమా లేదు. ఈ మాట అంటున్నది మరెవరో కాదు జాతీయ అవార్డు జ్యూరీ మెంబర్, దర్శకుడు ఎమ్‌బీ పద్మకుమార్. మమ్ముట్టి.. 2022 నుంచి గతేడాదివరకు దాదాపు తొమ్మిది సినిమాలతో అలరించాడు. వీటిలో ఒక్కటంటే ఒక్కటి కూడా జాతీయ అవార్డు కోసం పంపలేదు.
ఒక్క సినిమా పంపలేదు
దీని గురించి డైరెక్టర్ పద్మకుమార్ మాట్లాడుతూ.. మమ్ముట్టి నటించిన ఒక్క సినిమాను కూడా అవార్డుల కోసం పంపలేదు. జనాలు మాత్రం మళ్లీ ప్రభుత్వాన్ని తప్పుపడతారు. అసలు ఇలా ఎందుకు జరిగిందని మేము అడుగుతున్నాం. మమ్ముట్టి అద్భుత నటన కనబర్చిన సినిమాలను కూడా సబ్మిట్ చేయకపోవడం ఘోర తప్పిదం.
మాలీవుడ్‌కు తీరని లోటు
ఇది కేవలం మమ్ముట్టికి మాత్రమే లోటు కాదు.. మలయాళ సినిమాకు కూడా తీరని లోటు అని పేర్కొన్నాడు. కాగా 2023లో వచ్చిన నాన్పకల్ నెరటు మయక్కం, కాతల్: ద కోర్ వంటి సినిమాలు మమ్ముట్టికి మరింత పేరు తెచ్చిపెట్టాయి. ఇదిలా ఉంటే 2022 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 లోపు సెన్సార్ అయిన చిత్రాలు జాతీయ అవార్డు కోసం పోటీపడ్డాయి.
జాతీయ అవార్డులు
మలయాళ మూవీ ఆట్టమ్ ఉత్తమ చిత్రంగా నిలవగా రిషబ్ శెట్టి (కాంతార)ని ఉత్తమ నటుడు అవార్డు వరించింది. తిరుచిత్రాంబళమ్ మూవీకిగాను నిత్యామీనన్ ఉత్తమ నటి అవార్డు గెలుచుకుంది. కార్తికేయ 2 ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment