
మమ్ముట్టి ఏ పాత్ర చేసినా.. అందులో ఒదిగి పోతారన్న సంగతి తెలిసిందే. పైగా ఏ భాషలో నటించినా తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంటారు. మమ్ముట్టి తాజాగా పెరంబు, యాత్ర చిత్రాలతో ప్రేక్షకులను పలకరించారు. ఈ రెండు సినిమాలపై సూర్య ప్రశంసలు కురిపించారు.
మలయాళ, తమిళ భాషల్లో పెరంబు తెరకెక్కగా.. తెలుగు, మలయాళ, తమిళ, భాషల్లో యాత్ర తెరకెక్కింది. కూతురు, తండ్రికి మధ్య ఉండే ప్రేమానురాగాల నేపథ్యంలో పెరంబులో అద్భుతంగా నటించారని విమర్శకులు ప్రశంసించారు. యాత్ర సినిమాలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాత్రలో జీవించి.. పాత్రకు ప్రాణం పోశారు. ఇక ఈ చిత్రాలను వీక్షించిన హీరో సూర్య.. పెరంబు, యాత్ర సినిమాలను ఎంచుకున్న విధానం, వస్తున్న ఫీడ్‌బ్యాక్, స్వచ్చమైన సినిమాలను చేస్తూ.. మమ్మల్ని ఇన్‌స్పైర్ చేస్తున్నందుకు ధన్యవాదాలు’ అంటూ ట్వీట్ చేశాడు. సూర్య ప్రస్తుతం ఎన్‌జీకే చిత్రంతో బిజీగా ఉన్నాడు.
Recently #Peranbu n now #Yatra so many feedbacks and what a varied choice @mammukka .. Thank you team for inspiring us with this truth and purity of cinema! All respects 🙏🙏🙏 pic.twitter.com/qeNndXMRC5
— Suriya Sivakumar (@Suriya_offl) February 10, 2019
Comments
Please login to add a commentAdd a comment