peranbu
-
మమ్ముట్టిపై సూర్య ప్రశంసలు!
మమ్ముట్టి ఏ పాత్ర చేసినా.. అందులో ఒదిగి పోతారన్న సంగతి తెలిసిందే. పైగా ఏ భాషలో నటించినా తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంటారు. మమ్ముట్టి తాజాగా పెరంబు, యాత్ర చిత్రాలతో ప్రేక్షకులను పలకరించారు. ఈ రెండు సినిమాలపై సూర్య ప్రశంసలు కురిపించారు. మలయాళ, తమిళ భాషల్లో పెరంబు తెరకెక్కగా.. తెలుగు, మలయాళ, తమిళ, భాషల్లో యాత్ర తెరకెక్కింది. కూతురు, తండ్రికి మధ్య ఉండే ప్రేమానురాగాల నేపథ్యంలో పెరంబులో అద్భుతంగా నటించారని విమర్శకులు ప్రశంసించారు. యాత్ర సినిమాలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాత్రలో జీవించి.. పాత్రకు ప్రాణం పోశారు. ఇక ఈ చిత్రాలను వీక్షించిన హీరో సూర్య.. పెరంబు, యాత్ర సినిమాలను ఎంచుకున్న విధానం, వస్తున్న ఫీడ్‌బ్యాక్, స్వచ్చమైన సినిమాలను చేస్తూ.. మమ్మల్ని ఇన్స్పైర్ చేస్తున్నందుకు ధన్యవాదాలు’ అంటూ ట్వీట్ చేశాడు. సూర్య ప్రస్తుతం ఎన్జీకే చిత్రంతో బిజీగా ఉన్నాడు. Recently #Peranbu n now #Yatra so many feedbacks and what a varied choice @mammukka .. Thank you team for inspiring us with this truth and purity of cinema! All respects 🙏🙏🙏 pic.twitter.com/qeNndXMRC5 — Suriya Sivakumar (@Suriya_offl) February 10, 2019 -
అంజలి కోసమే..
లాంగ్రన్ హీరోయిన్లలో నటి అంజలి ఒకరు. అదే విధంగా లక్కీ నటి, బహుభాషా నటి కూడా. తెలుగు, తమిళం, మలయాళం అంటూ పలు భాషల్లో రాణిస్తున్నారు. ఒక భాషలో చిత్రాలు లేవనుకునేలోపే మరో భాషలో బీజీగా నటించడంతో అంజలికి మర్కెట్ పడిపోయిందని ఎవరైనా అనుకుంటే అది వారి అపోహనే అవుతుంది. పుష్కరంలోకి అడుగుపెట్టిన ఈ ఆరణాల తెలుగు ఆడపడుచు నేటికీ మంచి ప్రాచుర్యం కలిగిన కథానాయకిగానే కొనసాగుతున్నారు. అదేవిధంగా తన కోసమే దర్శకులు కథలు రాసే స్థాయికి ఎదిగారు. ప్రస్తుతం తమిళంలో ఒక చిత్రం, మలయాళంలో ఒక చిత్రం చేస్తూ బిజీగా ఉన్నారు. ఇటీవలే తెరపైకి వచ్చిన తరమణి చిత్రంలో గెస్ట్‌గా మెరిసిన అంజలి ఆ చిత్రంలో ఎట్రాక్షన్‌గా మారారని చెప్పవచ్చు. ఈ చిత్ర దర్శకుడు రామ్‌నే అంజలికి తమిళంలో నాయకిగా పరిచయం చేశారు. తొలుత 2005లో ‘ఫొటో’ అనే తెలుగు చిత్రం ద్వారా నాయకిగా రంగప్రవేశం చేసిన అంజలి కోలీవుడ్‌లో 2006 ‘కట్రదు తమిళ్’ చిత్రంతో రంగప్రవేశం చేశారు. దర్శకుడు రామ్ మాట్లాడుతూ కట్రదు తమిళ్ చిత్రం ద్వారా తాను పరిచయం చేసిన నటి అంజలి అని, తొలిచిత్రంలోనే పరిణితి చెందిన నటనను ఆమె అభినయించారని అన్నారు. నటి ఆండ్రియా కథానాయకిగా నటించిన తరమణి చిత్రంలో వ్యాపారపరంగా ప్లస్ అవుతారని అంజలిని అతిథి పాత్రల్లో నటింపజేయాలని భావించానన్నారు. తనను అడగగానే మరో ఆలోచన లేకుండా నటించడానికి ఓకే చెప్పారని తెలిపారు. ప్రస్తుతం మమ్ముట్టి కథానాయకుడిగా తాను దర్శకత్వం వహిస్తున్న పేరంబు చిత్రంలో అంజలినే కథానాయకిగా నటిస్తున్నారని చెప్పారు. తదుపరి చిత్రానికి అంజలిని దృష్టిలో పెట్టుకునే కథను తయారు చేస్తున్నానని దర్శకుడు రామ్ చెప్పారు. -
మలయాళ స్టార్‌తో... తమిళంలో...
తమిళంలో పేరు తెచ్చుకున్న తెలుగమ్మాయి అంజలికి ఇప్పుడు మరో బ్రహ్మాండమైన ఆఫర్ వచ్చింది. త్వరలోనే ఆమె మలయాళ మెగాస్టార్ మమ్మూట్టి సరసన నటించనున్నారు. కాకపోతే, ఇది మలయాళ సినిమా కాదండోయ్! తమిళ సినిమానే!! పేరు - ‘పేరణ్బు’. జాతీయ అవార్డులతో సహా పలు అవార్డులు సాధించి, ఆ మధ్య వార్తల్లో నిలిచిన ‘తంగ మీన్గళ్’ (బంగారు చేపలు అని అర్థం) చిత్ర దర్శకుడు రామ్ ఈ కొత్త చిత్రాన్ని రూపొందించనున్నారు. ఈ చిత్రానికి ఎవరిని హీరోయిన్గా ఎంచుకోవాలా అని ఆలోచించిన దర్శకుడు చివరకు తమిళంలో ‘అంగాడి తెరు’ (తెలుగులో ‘షాపింగ్ మాల్’గా అనువాదమైంది) ఫేమ్ అంజలి వైపు మొగ్గారు. ఈ సినిమాలో మమ్మూట్టి ఒక బిడ్డకు తండ్రిగా వివాహితుడి పాత్ర పోషించనున్నారు. దయ, కరుణ, జాలి లాంటి అంశాలన్నీ ప్రధానంగా ఈ చిత్రకథ నడుస్తుందట. ఇందులో అంజలి పాత్ర కూడా ఆ అంశాలకు తగ్గట్లే ఉంటుందట! కానీ, విచిత్రం ఏమిటంటే, ‘‘ఈ సినిమాలో మమ్మూట్టి, అంజలి భార్యాభర్తలు మాత్రం కాదు’’ అని దర్శకుడు రామ్ వివరించారు. గతంలో కొన్ని తమిళ చిత్రాల్లో నటించిన మమ్మూట్టి ‘వందేమాతరం’ తరువాత మళ్ళీ ఆరేళ్ళు గ్యాప్ ఇచ్చి, ఇప్పుడీ తమిళ చిత్రం చేస్తున్నారు. కొడెకైనాల్లో, ఆ తరువాత చెన్నైలో షూటింగ్ చేస్తారట. ‘తంగ మీన్గళ్’లో జాతీయ అవార్డు పొందిన బాలనటి సాధన కూడా ఈ ‘పేరణ్బు’లో కీలకపాత్ర ధరించనుంది. సంక్రాంతికి బాలకృష్ణ ‘డిక్టేటర్’ రానుండగా, ఇప్పుడీ తీపి కబురు. కొత్త సంవత్సరం మన అంజలికి కలిసొచ్చినట్లే ఉంది!