మమ్ముట్టి
17వ శతాబ్దంలోని కేరళ రాష్ట్ర కథతో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించిన చిత్రం ‘మామాంగం’. కావ్య ఫిల్మ్స్ పతాకంపై వేణు కున్నపిల్లి నిర్మించగా, ఎం.పద్మకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్ 21న మలయాళంతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా మమ్ముట్టి మాట్లాడుతూ– ‘‘మన దేశ సంస్కృతి విశిష్టమైనది. భాషలు మనల్ని విడదీస్తాయి. అయితే భాష వల్ల మన చరిత్ర వేరే వాళ్లకి తెలియకుండా పోకూడదు. కేరళ రాష్ట్ర చరిత్రతో సినిమా అంటే అది భారతదేశ చరిత్ర కూడా. సినీ మాద్యమం అన్ని భాషల ప్రేక్షకులను ఏకం చేస్తుంది’’ అన్నారు. పద్మకుమార్ మాట్లాడుతూ– ‘‘నిజమైన కథతో ఇంతకు ముందెన్నడూ చూడని విజువల్స్‌తో తెరకెక్కించిన చిత్రమిది’’ అన్నారు. ‘‘ ఈ సినిమా మేకింగ్ నెక్ట్స్ లెవెల్‌లో ఉంటుంది. భారీ బడ్జెట్‌తో రూపొందించాం’’ అన్నారు వేణు.
Comments
Please login to add a commentAdd a comment