ఓటీటీని షేక్‌ చేస్తున్న చిన్న చిత్రాలు.. స్ట్రీమింగ్‌ ఎక్కడో తెలుసా? | Malayalam Films List Streaming In Ott Goes Viral | Sakshi
Sakshi News home page

Malayalam Films: ఓటీటీలో మలయాళ హిట్‌ సినిమాల హవా..! ఒకటీ రెండు కాదు..

Published Tue, Nov 14 2023 2:01 PM | Last Updated on Tue, Nov 14 2023 6:00 PM

Malayalam Films List Streaming In Ott Goes Viral - Sakshi

ప్రస్తుత రోజుల్లో సినీ ప్రేక్షకులు ఎక్కువగా ఓటీటీలపైనే ఆధారపడుతున్నారు. సినిమాలు కుటుంబంతో కలసి ఇంట్లోనే చూసేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో ప్రతివారంలో రిలీజయ్యే సినిమాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఓటీటీలు వచ్చాక భాషతో సంబంధం లేకుండా చిన్న చిత్రాలను సైతం ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అంతే కాకుండా దక్షిణాదిలో మలయాళంలోనూ ప్రతివారం సినిమాలు ఓటీటీలో సందడి చేస్తున్నాయి.  తెలుగు డబ్బింగ్ వెర్షన్లు ఉన్న సినిమాలకు మరింత ఆదరణ లభిస్తోంది. అలాగే ఈ వారంలో మిమ్మల్ని అలరించేదుకు వస్తోన్న మాలీవుడ్‌ చిత్రాలేవో ఓ లుక్కేద్దాం. 

ఓటీటీలో అలరిస్తోన్న మాలీవుడ్ సినిమాలు ఇవే!

1. కన్నూరు స్క్వాడ్ - మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన చిత్రం కన్నూరు స్క్వాడ్. ఈ మూవీ మలయాళంలో రూ.100 కోట్లకుపైగా వసూలు చేసింది. ఈ సూపర్ హిట్ మూవీ ఈ శుక్రవారం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. 

2.మాస్టర్‌పీస్ వెబ్ సిరీస్ - నిత్య మీనన్ ప్రధాన పాత్రలో వచ్చిన మలయాళ కామెడీ వెబ్ సిరీస్ ఇది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లనే అందుబాటులో ఉంది.

3.కాసర్‌ గోల్డ్ - రెండున్నర కోట్ల విలువైన బంగారం చోరీ చుట్టూ తిరిగే యాక్షన్ థ్రిల్లర్ మూవీగా కాసర్ గోల్డ్ తెరకెక్కించారు. ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రం అక్టోబర్ 13 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

4.వాలట్టీ - రెండు కుక్కల చుట్టూ తిరిగే ఎమోషనల్ కథే వాలట్టీ. కుక్కలకు కూడా ఫీలింగ్స్ ఉంటాయని చెప్పే ప్రయత్నంలో భాగంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం నవంబర్ 7 నుంచే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.


5.18 ప్లస్ -  ప్రేమ, స్నేహం, కుటుంబ మద్దతు లేకుండా లేచిపోయి పెళ్లి చేసుకునే జంట ఇబ్బందులే కథాంశంగా తీసిన చిత్రమిది. సోనీలివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న ఫీల్ గుడ్ మూవీ ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంది. 

6.నెయ్‌మార్ - మనషులు, జంతువుల మధ్య ఉండే రిలేషన్స్‌ను చాటి చెప్పే సినిమా నెయ్‌మార్‌. నెయ్‌మార్ అనే ఓ కుక్క ఇద్దరు స్నేహితుల జీవితాలను ఎలా మార్చిందనేది కథాంశాన్నే తెరకెక్కించారు. ఈ సినిమా కూడా హాట్‌స్టార్‌లో అలరిస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement