అనసూయ భరద్వాజ్.. ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు దాదాపు ఉండరనే చెప్పాలి. కామెడీ షోకు గ్లామర్ అద్దిన ఈ యాంకర్ తన అందచందాలతోనే కాకుండా జబర్దస్త్ పంచులతో అభిమానులను బుట్టలో వేసుకుంది. తన టాలెంట్‌ను కేవలం బుల్లితెరకే పరిమితం చేయకుండా వచ్చిన అవకాశాలను చేజిక్కించుకుంటూ సినిమాల్లో నటిస్తూ వెండితెర మీద కూడా సత్తా చాటుతోంది. అయితే ఈ నటికి తెలుగులోనే కాకుండా ఇతర భాషల నుంచి కూడా ఆఫర్లు వస్తున్నాయట. ఇప్పటికే తమిళ స్టార్ విజయ్ సేతుపతి సినిమాలో ఓ కీలక పాత్ర ద్వారా రంగమ్మత్త కోలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే కదా!
తాజాగా ఆమెకు మాలీవుడ్ నుంచి పిలుపు వచ్చిందట. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కథానాయకుడిగా నటించనున్న భీష్మ పర్వంలో ఓ ముఖ్య పాత్రకు అనసూయను తీసుకుంటున్నారట. కాగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జీవితకథ ఆధారంగా వచ్చిన 'యాత్ర' సినిమాలో మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించగా అనసూయ కూడా ఓ కీలక పాత్రలో మెప్పించింది.
ఇందులో ఆమె నటనను చూసి ఇంప్రెస్ అయిన దర్శకుడు అమల్ నీరద్ 'భీష్మ పర్వం' సినిమాలోని ఓ పాత్రకు అనసూయ అయితేనే కరెక్ట్‌గా ఉంటుందని ఆమెను ఎంపిక చేశారట. ఈ చిత్రం ద్వారా ఆమె మాలీవుడ్ ఎంట్రీకి కూడా రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం అనసూయ 'క్రాక్' హీరో రవితేజ 'ఖిలాడీ' సినిమాలో ఓ ముఖ్య పాత్ర పోషిస్తోంది. మరోవైపు గోపీచంద్ 'సీటీమార్'లో ఐటమ్ సాంగ్‌లో ఆడిపాడింది.
Comments
Please login to add a commentAdd a comment