సిద్ది మహాజన్‌కట్టి
ఆనందమే.. 4 కోట్లతో తీసిన సినిమా దాదాపు 20 కోట్లు రాబడితే ఏ చిత్రబృందానికైనా ఆనందమే. మలయాళ చిత్రం ‘ఆనందం’ అలాంటి రికార్డునే సొంతం చేసుకుంది. అరుణ్ కురియస్, థామస్ మాథ్యూ, రోషస్ మాథ్యూ, విశాక్ నాయర్ ముఖ్య తారలుగా కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో గణేశ్ రాజ్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమాను ఆర్. సీతరామరాజు సమర్పణలో సుఖీభవ మూవీస్ పతాకంపై నిర్మాత ఎత్తరి గురురాజ్ తెలుగులో అనువదిస్తున్నారు.
వీర వెంకటేశ్వరరావు, వీఆర్‌బీ రాజు, రవి వర్మ చిలుకూరి ఈ చిత్రానికి సహనిర్మాతలు. ‘‘తెలుగు రైట్స్ కోసం చాలామంది పోటీ పడినా, మేము హక్కులు దక్కించుకున్నాం. రీమేక్ ఆఫర్స్ వచ్చాయి. కానీ సినిమాలో తెలుగు నేటివిటీ ఎక్కువగా ఉండటంతో అనువదించి, రిలీజ్ చేయాలనుకుంటున్నాం. నాలుగు రోజుల ఇండస్ట్రియల్ టూర్‌కి వెళ్లిన స్టూడెంట్స్ ఏం చేశారు? అనేది ఆసక్తికరం. సచిన్ వారియర్ మంచి సంగీతం ఇచ్చారు. మార్చి ఫస్ట్ వీక్‌లో సాంగ్స్‌ను, సినిమాను 16న విడుదల చేయాలనుకుంటున్నాం. ‘హ్యాపీడేస్’ను మరిపించే సినిమా అవుతుంది’’ అన్నారు గురురాజ్.
Comments
Please login to add a commentAdd a comment