కేన్స్ అవార్డ్ విన్నింగ్ సినిమా.. ఇప్పుడు థియేటర్లలో రిలీజ్‌కి రెడీ | All We Imagine As Light Movie Theatricla Release Date Details | Sakshi
Sakshi News home page

All We Imagine As Light Movie: రానా సమర్పణలో అవార్డ్ మూవీ రిలీజ్

Published Fri, Sep 20 2024 2:09 PM | Last Updated on Fri, Sep 20 2024 3:06 PM

All We Imagine As Light Movie Theatricla Release Date Details

భారతీయ దర్శకురాలు పాయల్‌ కపాడియా తీసిన సినిమా 'ఆల్‌ ఉయ్‌ ఇమేజిన్‌ యాజ్‌ ఏ లైట్‌'. కని కస్రుతి, దివ్య ప్రభ ప్రధాన పాత్రల్లో నటించారు. ఫ్రాన్స్, ఇండియా, నెదర్లాండ్స్, ఇటలీ, లక్సెంబర్గ్‌ దేశాలు ఈ సినిమా నిర్మాణంలో పాలుపంచుకున్నాయి. ఈ ఏడాది మేలో 77వ కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రదర్శించగా అద్భుతమైన స్పందనతో పాటు ప్రతిష్టాత్మకమైన గ్రాండ్‌ ప్రీ అవార్డు గెలుచుకుంది. ఇప్పుడు ఈ సినిమా మన దగ్గర థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నారు.

(ఇదీ చదవండి: తీస్తే 'దేవర' 8-9 గంటల సినిమా అయ్యేది: ఎన్టీఆర్)

'ఆల్‌ ఉయ్‌ ఇమేజిన్‌ యాజ్‌ ఏ లైట్‌' సినిమాని అక్టోబరు 2న ఫ్రాన్స్‌లో రిలీజ్‌ చేయనున్నారు. అంతకు ముందే సెప్టెంబరు 21న కేరళలోని కొన్ని థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. త్వరలో మిగతా ప్రాంతీయ భాషల్లోనూ విడుదల చేస్తారని తెలుస్తోంది. భారత దేశవ్యాప్తంగా తెలుగు హీరో రానాకి చెందిన స్పిరిట్‌ మీడియా నిర్మాణ సంస్ఛ డిస్ట్రిబ్యూషన్ చేయనుంది.

మలయాళ వెర్షన్‌ సినిమా 'ప్రభయయ్ నీనచతళం' పేరుతో రిలీజ్ కానుంది. కథ విషయానికొస్తే ముంబైలో పనిచేస్తున్న కేరళ నర్సులు ప్రభ, అను జీవితాల్లో జరిగిన సంఘటనల ఏంటి? చివరకు ఏమైందనేదే కాన్సెప్ట్‌తో దీన్ని తెరకెక్కించారు. ఇకపోతే వచ్చే ఏడాది ఆస్కార్ బరిలోనూ ఈ సినిమాని నిలపాలని మేకర్స్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఫ్రాన్స్‌ దేశం ఈ చిత్రాన్ని షార్ట్‌ లిస్ట్‌ చేసిందని టాక్‌. 

(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసిన 22 సినిమాలు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement