ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఓటీటీల హవా ఓ రేంజ్‌లో కొనసాగుతోంది. అన్ని భాషల్లో సినిమాలు అందుబాటులోకి రావడం ఓటీటీల వల్లే మరింత సులువుగా మారింది. అందుకే భాషతో సంబంధం లేకుండా ప్రతి సినిమాను సీనీ ప్రియులు ఆదరిస్తున్నారు. ముఖ్యంగా చిన్న సినిమాలు డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ చేస్చున్నారు. చిన్న సినిమాలకు ఓటీటీ ఫ్లాట్‍ఫామ్ ఓ వరంలా మారిందనే చెప్పాలి.
(ఇది చదవండి: అక్కినేని ఇంట తీవ్ర విషాదం..)
అయితే సెప్టెంబర్ 15న థియేటర్లలో రిలీజైన మలయాళ చిత్రం కాసర్ గోల్డ్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టిన కాసర్ గోల్డ్ ఈనెల 13న ఓటీటీలోకి వచ్చేసింది. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీకి ఊహించని రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రం మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ భాషల్లోనూ అందుబాటులో ఉంది.
అసలు కథేంటంటే..
ఓ రాజకీయ నాయకుడు స్మగ్లింగ్ గోల్డ్ పడిపోవడం.. ఆ బంగారాన్ని తిరిగి చేజిక్కించుకోవడానికి అతని అనుచరులు ప్రయత్నంచడం అనే కథాంశంతో ఈ మూవీని తెరకెక్కించారు. మృదుల్ నాయర్ తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో జైలర్ ఫేమ్ వినాయకన్ ముఖ్య పాత్రలో నటించారు. అలాగే దసరా విలన్ షైన్ టామ్ చాకో కూడా ముఖ్య పాత్ర చేశాడు. యూడ్లీ ఫిల్మ్స్ బ్యానర్‌పై విక్రమ్ మెహ్రా, సిద్దార్థ్ ఆనంద్ నిర్మించారు. ఈ సినిమాలో అసీఫ్ అలీ, సన్నివేలన్, సిద్ధిఖీ, సంపత్ రామ్, దీపక్ పారంబోల్ ప్రధాన పాత్రల్లో నటించారు.
(ఇది చదవండి: శివకార్తికేయన్ నన్ను దారుణంగా మోసం చేశాడు: సంగీత దర్శకుడు)
Comments
Please login to add a commentAdd a comment