ఈ మధ్య థియేటర్లలో కావొచ్చు.. ఓటీటీలో కావొచ్చు సరైన మాస్ మసాలా యాక్షన్ మూవీ రాలేదని చెప్పొచ్చు. ఇప్పుడు ఆ లోటు తీర్చడానికా అన్నట్లు ఓ మలయాళ సూపర్‌హిట్ మూవీ.. ఓటీటీ విడుదలకు సిద్ధమైపోయింది. ఆగస్టు 25న థియేటర్లలో రిలీజైన 'RDX' ఓ చిన్న సినిమా. కానీ అదే రోజు విడుదలైన దుల్కర్, నివీన్ పౌలీ చిత్రాలని మించి బ్లాక్‌బస్టర్ అయింది.
'ఆర్‌డీఎక్స్' ప్రత్యేకత ఏంటి?
స్టోరీ పరంగా చూస్తే ఇదేం కొత్త కథ కాదు. మాస్, ఫ్యామిలీ, కామెడీ, యాక్షన్, ఎమోషన్, ఫ్రెండ్‌షిప్, లవ్ ఇలా అన్నీ ఉన్నాయి. సింపుల్‌గా చెప్పాలంటే ఇది ఓ హై ఓల్టేజ్ యాక్షన్ సినిమా. అయితే తెలిసిన కథే అయినా దర్శకుడి డిఫరెంట్ ప్రెజంటేషన్ మలయాళంలో అందరికీ బాగా నచ్చేసింది. ఇప్పుడు ఇదే చిత్రాన్ని నెల రోజుల్లోనే ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'ఏజెంట్'.. ఐదు నెలల తర్వాత విడుదలకు రెడీ)
ఓటీటీ డేట్
ఆగస్టు 25న థియేటర్లలో రిలీజైన ఈ సినిమాను.. సెప్టెంబరు 24న అంటే ఈ ఆదివారం ఓటటీలోకి తీసుకురానున్నారు. ప్రస్తుతం మలయాళం మాత్రమే అందుబాటులో ఉంటుంది. త్వరలో మిగతా భాషల్ని జోడించొచ్చని అనిపిస్తుంది.
'RDX' కథేంటి?
రాబర్ట్ (షేన్ నిగమ్), డోని (ఆంటోని వర్గీస్) అన్నదమ్ములు. వీళ్ల ఫ్రెండ్ గ్జేవియర్ (నీరజ్ మాధవ్). చర్చి ఫెస్టివల్‌లో తన తండ్రిపై చేయి చేసుకున్నాడని ఓ అల్లరి ముకని డోని చితకబాదుతాడు. ఆ తర్వాత అదే రౌడీ గ్యాంగ్.. డోని ఇంటికొచ్చి చిన్న పిల్లలని వదలకుండా ఫ్యామిలీ మొత్తంపై దాడి చేస్తారు. అసలు ఈ దాడి చేసిన గ్యాంగ్ ఎవరు? వాళ్లకు డోని కుటుంబంపై పగ ఎందుకు? మరి డోని, రాబర్ట్, గ్జేవియర్.. గ్యాంగ్‌పై పగ ఎలా తీర్చుకున్నారనేదే స్టోరీ.
(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్'లో 3వ వారం ఎలిమినేట్ అయ్యేది ఆమెనా?)
Comments
Please login to add a commentAdd a comment