సూపర్‌స్టార్ కొత్త మూవీ.. టీజర్ మాత్రం అదుర్స్! | Mohanlal's 'Malaikottai Vaaliban' Movie Teaser | Sakshi
Sakshi News home page

సూపర్‌స్టార్ కొత్త మూవీ.. టీజర్ మాత్రం అదుర్స్!

Published Sat, Dec 9 2023 4:42 PM | Last Updated on Sat, Dec 9 2023 5:20 PM

Mohanlal Malaikottai Valiban Movie Teaser - Sakshi

మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ హీరోగా నటించిన కొత్త సినిమా 'మలైకోట్టై వాలిబన్‌'. లిజో జోస్‌ పల్లిచోలి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జాన్‌ మేరీ క్రియేటివ్‌, సెంచరీ ఫిలిమ్స్‌, మ్యాక్స్‌ ల్యాబ్‌, సరిగమ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. పీరియాడికల్ డ్రామాగా తీసిన ఈ చిత్ర షూటింగ్‌ పూర్తిచేసుకుని ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.

(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 17 సినిమాలు.. మొత్తంగా 33 రిలీజ్!)

ఈ సినిమాని వచ్చే ఏడాది రిపబ్లిక్‌ డే సందర్భంగా జనవరి 25న మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఈ మూవీ.. దర్శకుడి అద్భుత పనితనమని హీరో మోహన్ లాల్ చెప్పుకొచ్చారు. టీజర్‌లో చూపించిన సన్నివేశాలకు ఏమాత్రం తగ్గకుండా మూవీ ఉంటుందని అన్నారు. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తుందనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. 

(ఇదీ చదవండి: శోభను ఎవడు పెళ్లి చేసుకుంటాడో అంటూ శివాజీ చిల్లర వ్యాఖ్యలు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement