ఈ మధ్య కాలంలో థియేటర్లలో రిలీజై సూపర్ హిట్ అయిన మలయాళ సినిమా 'మంజుమ్మల్ బాయ్స్'. అందరూ ఈ సినిమా గురించి ఆహా ఓహో అని తెగ పొగిడేస్తున్నారు. తెలుగు ప్రేక్షకులు కూడా దీని డబ్బింగ్ వెర్షన్ ఎప్పుడు విడుదలవుతుందా అని చూస్తున్నారు. సరిగ్గా ఇలాంటి టైంలో ఈ చిత్రాన్ని ప్రముఖ తమిళ రచయిత జయమోహన్ ఏకిపారేశారు. ఇదో చెత్త సినిమా, కేరళ వాళ్లంతా లోఫర్స్ అని దారుణమైన విమర్శలు చేశారు.
ఇంతకీ ఏమైంది?
2006లో తమిళనాడులోని కొడైకెనాల్ గుహలో కేరళ కుర్రాడు పడిపోయాడు. అప్పుడు కూడా వచ్చిన స్నేహితులు అతడిని రక్షించారు. ఇదే కథతో 'మంజుమ్మల్ బాయ్స్' సినిమా తీశారు. ఇప్పటివరకు దీనికి రూ.150 కోట్ల మేర కలెక్షన్స్ వచ్చాయి. అయితే ఈ మూవీలో ప్రధాన పాత్రల్లో నటించిన కుర్రాళ్లంతా మందు తాగుతూ, జల్సా చేస్తూ ప్రమాదానికి గురవుతారు. ఇప్పుడు ఈ పాయింట్ పట్టుకుని, రచయిత జయమోహన్ ఘోరమైన విమర్శలు చేశారు.
(ఇదీ చదవండి: ఎట్టకేలకు బయటకొచ్చిన అనుష్క.. ఇంతలా మారిపోయిందేంటి!?)
రచయిత ఏమన్నారు?
'కేరళ అడవుల్లో, అక్కడి యువకులు తాగి పడేసిన మందు బాటిల్స్ విరగ్గొడుతున్నారు. ఆ పెంకులు గుచ్చుకుని చాలా ఏనుగులు చనిపోతున్నాయి. మలయాళ టూరిస్టులు ఎక్కడికెళ్లినా అలాంటి పనులే చేస్తారు. తాగి నిషేధిత ప్రాంతంలోకి వెళ్లి లోయలో పడటాన్ని చాలా గొప్పగా చూపించడం ఓ చెత్త పని. అదో చెత్త సినిమా. నా దృష్టిలో 'మంజుమ్మల్ బాయ్స్'.. ఓ పనికిమాలిన మూవీ' అని జయమోహన్ విమర్శించారు.
రైటర్ జయమోహన్ వ్యాఖ్యలపై సగటు కేరళ ప్రేక్షకుడు మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు. ఎవరో కొందరు చేసిన పనికి ఇలా అందరినీ ఆపాదించి చెప్పడం సరికాదని అంటున్నారు. ఏదేమైనా అందరూ హిట్ అని తెగ మురిసిపోతున్న 'మంజుమ్మల్ బాయ్స్'పై కాంట్రవర్సీ కామెంట్స్ చేసి జయమోహన్ వార్తల్లో నిలిచారు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 24 సినిమాలు.. ఆ మూడు స్పెషల్)
Comments
Please login to add a commentAdd a comment