
పదిహేనేళ్లకు పైగా అగ్ర కథానాయికల్లో ఒకరిగా రాణిస్తున్న తమన్నా తొలిసారి ఓ మలయాళ సినిమా చేయడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. మలయాళ హిట్ ఫిల్మ్ ‘రామ్‌లీల’ (2017) తర్వాత హీరో దిలీప్, దర్శకుడు అరుణ్ గోపీ కాంబినేషన్‌లో తాజాగా మరో సినిమా తెరకెక్కుతోంది. ‘బాంద్రా’ అనే టైటిల్ అనుకుంటున్నారు. ఇందులో తమన్నా హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఆమె కెరీర్‌లో ఇదే తొలి మలయాళ సినిమా.
కాగా కొచ్చిలో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్‌లో తమన్నా పాల్గొననున్నారు. ఈ నెల 20 నుంచి తమన్నా ఈ సినిమా షెడ్యూల్‌లో జాయిన్ అవుతారట. ఆ తర్వాత ముంబై లొకేషన్స్‌లో మరో షెడ్యూల్‌ను ప్లాన్ చేసిందట చిత్ర యూనిట్. కాగా ఈ సినిమాలో తమన్నా యువరాణి తరహా పాత్ర చేస్తున్నారని టాక్. ఈ పాత్ర మలయాళం, హిందీ భాషలు మాట్లాడుతుందట. కొచ్చితో పాటు ముంబై నేపథ్యంలోనూ సినిమా సాగుతుందని సమాచారం.
ఈ సంగతి ఇలా ఉంచితే.. నటుడు విజయ్ వర్మతో తమన్నా ప్రేమలో ఉన్నారనే వార్త వచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల కొత్త సంవత్సరాన్ని ఈ ఇద్దరూ గోవాలో జరుపుకున్నారంటూ కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఈ వార్త గురించి ఇటు తమన్నా కానీ అటు విజయ్ వర్మ కానీ స్పందించలేదు.
Comments
Please login to add a commentAdd a comment