
ఆరు పదుల వయసులో ఉన్న మోహన్‌లాల్‌ని యువకుడు అంటున్నారు దర్శకుడు లిజో జోస్ పెల్లిసరీ. మోహన్‌లాల్ టైటిల్ రోల్‌లో లిజో జోస్ పెల్లిసరీ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘మలైకోట్టై వాలిబన్’ (మలైకోట యువకుడు అని అర్థం). ఈ చిత్రంలోని మోహన్‌లాల్ లుక్‌ని విడుదల చేశారు.
ఓ యాక్షన్ సీన్‌కి సంబంధించిన లుక్ ఇది. ‘‘జనవరి 18న రాజస్థాన్‌లోని జై సల్మేర్‌లో ఈ చిత్రం షూటింగ్‌ని ఆరంభించాం. హై బడ్జెట్‌తో రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని మలయాళంతో పాటు ఇతర ప్రముఖ భాషల్లో విడుదల చేస్తాం’’ అని చిత్రనిర్మాతలు షిబు బేబీ జాన్, కొచుమొన్, అనూప్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment