ఈ వారం ఓటీటీల్లో 16 సినిమాలు రిలీజ్.. అవేంటంటే? | Sakshi
Sakshi News home page

This Week OTT Movies: ఓటీటీల్లోకి 16 మూవీస్.. అవి మాత్రం స్పెషల్

Published Mon, Apr 29 2024 8:31 AM

Upcoming OTT Release Movies In Telugu May 1st Week 2024

ఎప్పటిలానే మరో వారం వచ్చేసింది. ఈసారి కూడా థియేటర్లలో 'ప్రసన్నవదనం', 'కృష్ణమ్మ', 'జితేందర్ రెడ్డి' సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఉన్నంతలో సుహాస్ 'ప్రసన్నవదనం'పై కాస్త అంచనాలు ఉన్నాయి. మరోవైపు ఓటీటీలో మాత్రం చాలావరకు కొత్త చిత్రాలు రాబోతున్నాయి. వీటిలో ఓ రెండు మాత్రమే కాస్త ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి.

(ఇదీ చదవండి: హైదరాబాద్‌లో ల్యాండ్ కొన్న 'బిగ్ బాస్' ప్రియాంక)

ఓటీటీలో ఈ వారం దాదాపు 16 సినిమాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వీటిలో ఇంగ్లీష్-హిందీ చిత్రాల సంగతి పక్కనబెడితే 'మంజుమ్మల్ బాయ్స్', 'సైతాన్' చిత్రాలు మాత్రమే చూడదగ్గవి అనిపిస్తున్నాయి. మిగతా వాటి గురించి రిలీజైతే తప్ప ఏం చెప్పలేం. ఇంతకీ ఈసారి ఓటీటీల్లోకి ఏం రాబోతున్నాయి. ఎందుకు స్ట్రీమింగ్ కాబోతున్నాయనేది చూద్దాం.

ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ జాబితా (ఏప్రిల్ 29 నుంచి మే 5 వరకు)

నెట్‌ఫ్లిక్స్

  • ఫియాస్కో (ఫ్రెండ్ సిరీస్) - ఏప్రిల్ 30

  • టీ పీ బన్ (జపనీస్ సిరీస్) - మే 02

  • సైతాన్ (హిందీ సినిమా) - మే 03

  • ద అటిపికల్ ఫ్యామిలీ (కొరియన్ సిరీస్) - మే 04

అమెజాన్ ప్రైమ్

  • అంబర్ గర్ల్స్ స్కూల్ (హిందీ సిరీస్) - మే 01

  • ద ఐడియా ఆఫ్ యూ (ఇంగ్లీష్ మూవీ) - మే 02

  • క్లార్క్ సన్ ఫార్మ్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - మే 03

  • ఉమన్ ఆఫ్ మై బిలియన్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) - మే 03

హాట్‌స్టార్

  • ద వెయిల్ (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 30

  • మంజుమ్మల్ బాయ్స్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - మే 05

  • మాన్‌స్టర్స్ ఎట్ వర్క్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - మే 05

జియో సినిమా

  • మైగ్రేషన్ (ఇంగ్లీష్ సినిమా) - మే 01

  • హ్యాక్స్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - మే 03

  • ద టాటూయిస్ట్ ఆఫ్ అస్విట్జ్ (ఇంగ్లీష్ సిరీస్) - మే 03

  • వోంకా (ఇంగ్లీష్ మూవీ) - మే 03

ఆపిల్ ప్లస్ టీవీ

  • అకాపుల్కో సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - మే 01

(ఇదీ చదవండి: కొత్త ఇంట్లోకి 'జబర్దస్త్' కమెడియన్.. వీడియో వైరల్)

Advertisement
Advertisement