నా పాటలన్నీ బ్లాక్ బస్టర్స్! | Know what Mika Singh has to say about Akshay Kumar | Sakshi
Sakshi News home page

నా పాటలన్నీ బ్లాక్ బస్టర్స్!

Published Sun, May 8 2016 10:12 AM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

నా పాటలన్నీ బ్లాక్ బస్టర్స్! - Sakshi

నా పాటలన్నీ బ్లాక్ బస్టర్స్!

ముంబై: బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తనకు వెరీ లక్కీ అని సింగర్ మికా సింగ్ అంటున్నాడు. అక్షయ్ హీరోగా నటించిన 'హౌస్ ఫుల్ 3' మూవీలోనూ కొన్ని పాటలు పాడిన మికా ఆ హీరోపై తన అభిమానాన్ని చాటుకున్నాడు. తాను పాడిన పాట 'తాంగ్ ఉత్కే' ఆవిష్కరణలో మికా మాట్లాడుతూ... 'సింగ్ ఈజ్ కింగ్ లో తొలి పాట పాడాను. అది చాలా సూపర్ హిట్టయింది. సింగ్ ఈజ్ కింగ్ పాట కేవలం అక్షయ్ వల్లనే సక్సెస్ అయింది. ఆ హీరో కోసం నేను పాడిన పాటలు అన్నీ బాగా పాపులర్ అయ్యాయి' అని సింగర్ మికా ఆనందాన్ని వ్యక్తంచేశాడు.

'స్టంట్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకునే అక్షయ్ చాలా బాగా డ్యాన్స్ చేశాడు. దాంతో పాటలకు మంచి జోష్ వచ్చింది' అని మికా చెప్పాడు. ఇప్పటివరకూ చాలా పాటలు పాడాను. అందులో అక్షయ్ కోసం పాడినవే ఎక్కువగా ఉన్నాయ. నాకు మాత్రం 'సింగ్ ఈజ్ కింగ్' ఆల్ టైమ్ ఫెవరెట్ గా నిలిచిపోతుంది. లేటెస్ట్ మూవీ 'హౌస్ ఫుల్ 3'లో అభిషేక్ బచ్చన్, రితేష్ దేశ్ముఖ్, జాక్వెలైన్ ఫెర్నాండేజ్, నర్గీస్ ఫక్రీ, లిసా హేడాన్, తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement