స్టార్ హీరో చోరీ చేశాడు..! | Akshay Kumar turns thief on hindi TV show | Sakshi
Sakshi News home page

స్టార్ హీరో చోరీ చేశాడు..!

May 15 2016 10:14 AM | Updated on Apr 3 2019 6:34 PM

స్టార్ హీరో చోరీ చేశాడు..! - Sakshi

స్టార్ హీరో చోరీ చేశాడు..!

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ వాచీ చోరీ చేశాడు.

ముంబై: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ వాచీ చోరీ చేశాడు. హీరో ఏంటీ.. వాచీని దొంగిలించడమేంటని ఆశ్చర్యపోతున్నారా.. ఆ వివరాలు చూడండి. బాలీవుడ్, హిందీ టీవీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని కార్యక్రమం 'ద కపిల్ శర్మ షో'. ఈ షో లేటెస్ట్ ఈవెంట్లో కొందరు బాలీవుడ్ స్టార్లు పాల్గొని అభిమానులను అలరించారు. 'హౌస్ ఫుల్ 3' మూవీలో నటిస్తున్న హీరోలు అభిషేక్ బచ్చన్, అక్షయ్ కుమార్, రితేష్ దేశ్ ముఖ్ కపిల్ శర్మ టీవీ షోలో పాల్గొన్ని సందడి చేశారు.

కపిల్ శర్మ ఈవెంట్లో ఓ లక్కీ కాంటెస్టెంట్ ను విజేతగా ఎంపికచేస్తారు. అతడిని స్టేజ్ మీదకు పిలిచి గిఫ్ట్ ఇచ్చారు. అయితే స్టార్ హీరోలతో ఆ లక్కీ అభిమాని హ్యాపీగా ఉన్నాడు. వారితో కొద్దిసేపు ముచ్చటిస్తుండగా.. అక్షయ్ చాకచక్యంగా ఆ వ్యక్తి వద్ద నుంచి వాచీ కొట్టేశాడు. ఈ విషయం అక్షయ్ చెప్పేవరకూ అతడు గుర్తించలేకపోయాడట. కొద్దిసేపటి తర్వాత అక్షయ్ ఆ లక్కీ కాంటెస్టెంట్ ను పిలిచి వాచీ ఇచ్చేసి అతడితో కాసేపు ముచ్చటించాడు. తన వాచీని హీరో ఎప్పుడు కొట్టేశాడో అర్థంకాక లక్కీ పర్సన్ ఆశ్చర్యపోయాడు. తమ మూవీ ప్రమోషన్లో భాగంగా కొన్ని సీన్ల గురించి ఈ స్టార్ హీరోలు అభిమానులతో కొద్ది సమయం ముచ్చటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement