
Mika Singh Revealed Why He Looking For His Life Partner: బాలీవుడ్ పాపులర్ సింగర్‌లో ఒకరు మికా సింగ్. అనేక పాటలను తన హుషారైన గాత్రంతో పాడి ప్రేక్షకులను అలరించాడు. తాజాగా ఆయన తన జీవిత భాగస్వామి కోసం వెతుకులాట మొదలుపెట్టనున్నాడు. అది కూడా ఎందుకోసమో వివరించాడు. రాఖీ సావంత్, మల్లికా షెరావత్, రతన్ రాజ్‌పుత్, రాహుల్ మహాజన్ తర్వాతి ఇప్పుడు మికా సింగ్ కోసం స్వయంవరం ఏర్పాటు చేయనుంది ఓ నేషనల్ ఛానెల్. మికా ది వోహ్తి అనే పేరుతో ఒక రియాలిటీ షోను ప్రారంభిస్తోంది స్టార్ భారత్ ఛానెల్. ఇప్పటికే ఈ షోలో పాల్గోనేవారికోసం రిజిస్ట్రేషన్లు కూడా ప్రారంభించారు. ఈ స్వయంవరం ఎందుకు అనే విషయాన్ని ఈ షో ప్రోమో ద్వారా తెలియజేశాడు మికా.
ఈ ప్రోమోలో 'నేను 2000కుపైగా వివాహాల్లో ప్రదర్శించాను. అలాగే ఎన్నో పాటలు పాడి కెరీర్‌లో విజయం సాధించాలన్నేదే నా ఉద్దేశం. నా మొదటి పాట మౌజా హి మౌజా పాడినప్పుడు ఇలాగే కొనసాగాలని అనుకున‍్నాను. మ్యూజిక్ డైరెక్టర్ ఎఆర్. రెహమాన్, ఇతర ప్రముఖ సంగీత దర్శకుల్లాగా గొప్పవాన్ని కావాలనుకుంటున్నాను. భగవంతుని దయతో నేను ముందుకు సాగుతున్నాను. కానీ ఇప్పుడు నేను పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలని దలేర్ పాజీ, భాభిజీ కోరారు. నా బంధువుల కోరిక నిమిత్తం నేను నా జీవిత భాగస్వామిని వెతకాలనుకుంటున్నా. వారి కోరికను నేను నెరవేర్చాలని అనుకుంటున్నా. అందుకోసం వారిని కొద్ది సమయం వేచి ఉండమని అభ్యర్థించాను.' అని మికా తెలిపాడు. ఇంకా వివరిస్తూ 'నేను టీవీ ఛానెల్ నుంచి ఈ ఆఫర్ అందుకున్నట్లు మా దలేర్ పాజీకి తెలియజేశాను. అతను సంతోషంతో అవును.. నువ్ ఎందుకు ఇలా ప్రయత్నించకూడదు ? నీకు సరైనా జీవిత భాగస్వామి దొరుకుతుంది.' అని పేర్కొన్నాడు. అలాగే ఈ టీవీ షో డబ్బు కోసం చేయట్లేదని మికా సింగ్ తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment