
సాక్షి, ముంబై : బాలీవుడ్ ప్రముఖ సింగర్ మికా సింగ్ ఇంట్లో చోరి జరిగింది. దాదాపు మూడు లక్షలు వరకు చోరి అయ్యాయి. రెండు లక్షల విలువైన ఆభరణాలు, లక్ష రూపాయల నగదు పోయినట్లు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. గతంలో ఆయన దగ్గర పనిచేసిన వ్యక్తిపై అనుమానంతో అతని కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అయితే ఈ చోరిపై మికా సింగ్ స్పందించలేదు. భజరంగీ భాయిజాన్ (ఆజ్ కి పార్టీ), కిక్ (జుమ్మెకీ రాత్), జంజీర్ (ముంబై హీరో) లాంటి పాటలను మికా సింగ్ ఆలపించారు. ప్రముఖ టీవీ కార్యక్రమాలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు.
Comments
Please login to add a commentAdd a comment