అమెరికా 47వ అధ్యక్షునిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశారు. నాలుగేళ్ల తర్వాత డోనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చారు. ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవంలో గాయని, పాటల రచయిత్రి క్యారీ అండర్వుడ్ ‘అమెరికా ది బ్యూటిఫుల్’ ను ప్రదర్శించారు. ఈ నేపధ్యంలో క్యారీ అండర్వుడ్ గురించి తెలుసుకోవాలని చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు.
క్యారీ అండర్‌వుడ్.. అమెరికన్ గాయని, నటి, రచయిత. ఆమె 1983 మార్చి 10న ఒక్లహోమాలోని పిల్ల్స్‌బోరోలో జన్మించారు. ఆమె సంగీత ప్రస్థానం 2005లో ‘అమెరికన్ ఐడల్’ రియాలిటీ షోలో విజేతగా నిలిచిన అనంతరం ప్రారంభమైంది. క్యారీ అండర్‌వుడ్ అద్భుతమైన గాయనిగా పేరొందారు. దీనికి తోడు ఆమె పలువురి అభినందనలను అందుకున్నారు. సంగీతం పరంగా ఆమె పలు రికార్డులను సృష్టించారు.
క్యారీ ఇప్పటివరకూ ఏడు ఆల్బమ్స్ విడుదల చేశారు. అందులో మొదటిది ‘Some Hearts’. ఇది 2005లో విడుదలకాగా, ఎనిమిది మిలియన్లకు మించిన కాపీలు విక్రయమయ్యాయి. ఆమె మొదటి నాలుగు సింగిల్స్ హిట్ కావడంతో ఆమె మరింత గుర్తింపును పొందారు. క్యారీ అండర్‌వుడ్.. తన కంట్రీ మ్యూజిక్‌లో అత్యంత ప్రభావవంతమైన రెండవ వ్యక్తిగా నిలిచారు.
అమెరికా పాటగా గుర్తింపుగా నిలిచిన ‘అమెరికా ది బ్యూటిఫుల్’కు ఆమె ప్రదర్శన తోడవడంతో ఆ పాటకు మరింత ప్రధాన్యత ఏర్పడిందంటారు. ఈ పాటు దేశభక్తి, నేషనలిజం, సమానత్వం తదితర అంశాలను ప్రతిబింబిస్తుంది. ఈ ప్రదర్శన 2021లో జరిగిన బైడెన్ ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమంలోనూ ప్రదర్శితమయ్యింది. క్యారీ అండర్‌వుడ్ వ్యక్తిగత జీవితం కూడా చర్చల్లో నిలిచింది. ఆమె మైక్ ఫిషర్ అనే హాకీ క్రీడాకారుడిని 2010లో వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు సంతానం. అమెరికా ది బ్యూటిఫుల్ ప్రదర్శనలో క్యారీ అండర్‌వుడ్ ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. అండర్‌వుడ్ పలువురు యువ కళాకారులకు, అభిమానులకు స్ఫూర్తినిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Kumbh Mela: కుంభమేళాకు వెళితే వీటిని తప్పక చూడండి
Comments
Please login to add a commentAdd a comment