
దెబ్బలు పడతాయరోయ్ అని యూత్ అంతా 'పుష్ప 2'లోని కిస్సిక్ పాట తెగ పాడేస్తున్నారు.

బన్నీ, శ్రీలీల స్టెప్పులు చూసి యూత్ అంతా వైబ్ అవుతున్నారు. కానీ ఈ పాట పాడిన సింగర్‌ని గుర్తించట్లేదు.

'కిస్సిక్' పాట పాడిన గాయని పేరు సుబ్లాషిని. ఈమెది తమిళనాడు.

సొంతంగా ఆల్బమ్ సాంగ్స్ చేస్తూ వాటిని ఇన్ స్టాలో పోస్ట్ చేసేది.

ఈమెలోని ప్రతిభని రిత్విజ్ అనే యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ తొలుత గుర్తించాడు.

ఓ పాటల పోటీలో గెలిచిన ఈమె.. 2020లో 'కనా' పాట పాడే అవకాశం దక్కించుకుంది.

'కాతాడి' అని మరో పాట కూడా పాడింది. దీన్ని హీరో దుల్కర్ సల్మాన్ మెచ్చుకోవడం విశేషం.

రీసెంట్ టైంలో 'గోల్డెన్ స్పారో' అనే తమిళ పాటతో సుబ్లాషిని టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అయిపోయింది.

అలా ఆ పాట కాస్త 'కిస్సిక్' అవకాశాన్ని తెచ్చిపెట్టిందని టాక్. ఇప్పుడీ పాటతో సుబ్లాషినికి మంచి గుర్తింపు వస్తోంది.












