లతా మంగేష్కర్‌కు యశ్ చోప్రా అవార్డు | Lata Mangeshkar gets Yash Chopra memorial award | Sakshi
Sakshi News home page

లతా మంగేష్కర్‌కు యశ్ చోప్రా అవార్డు

Published Mon, Oct 21 2013 1:16 AM | Last Updated on Fri, Sep 1 2017 11:49 PM

లతా మంగేష్కర్‌కు యశ్ చోప్రా అవార్డు

లతా మంగేష్కర్‌కు యశ్ చోప్రా అవార్డు

ముంబై: ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్‌కు మరో అరుదైన గౌరవం లభించింది. హిందీ సినిమా రంగానికి చేసిన సేవలకుగాను యశ్ చోప్రా స్మారక అవార్డుతో ఆమెను ఘనంగా సత్కరించారు. శనివారం రాత్రి ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి మనీష్ తివారీ చేతుల మీదుగా ఆమెకు ఈ పురస్కారం ప్రదానం చేశారు. ప్రముఖ దర్శక నిర్మాత యశ్ చోప్రా స్మారకార్థం టీఎస్సార్ ఫౌండేషన్ తరఫున కాంగ్రెస్ నేత టి.సుబ్బరామిరెడ్డి ఈ అవార్డును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా లతా మంగేష్కర్ మాట్లాడుతూ.. తనకు యశ్‌చోప్రా ఎంతో సన్నిహితుడని తెలిపారు.
 
 ‘‘మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాను. డాక్టర్లు బయటకు వెళ్లకుండా విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. కానీ ఈ కార్యక్రమానికి ఎలాగైనా రావాలనుకున్నాను. అవార్డు కోసమో లేదా రూ.10 లక్షల నగదు కోసమో నేను ఇక్కడకు రాలేదు. యశ్‌జీ నాకు చాలా ప్రత్యేకమైన వ్యక్తి. నాకు ఎంతో సన్నిహితుడు’’ అని తెలిపారు. చోప్రా భార్య పమేలా కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సినిమా రంగానికి చేసిన సేవలకు గాను లతా మంగేష్కర్‌ను తొలి యష్ చోప్రా స్మారక అవార్డుతో సత్కరించాలని నిర్ణయించినట్టు సుబ్బరామిరెడ్డి తెలిపారు. హేమమాలిని, సిమి గారేవల్, అనిల్ కపూర్‌లతో కూడిన కమిటీ.. ఈ అవార్డుకు లతను ఎంపిక చేసింది. బాలీవుడ్ సెలబ్రిటీలు శ్రీదేవి, బోనీకపూర్, అనుష్కా శర్మ, జితేంద్ర, రాణీ ముఖర్జీ, అక్షయ్ కుమార్, సుభాష్ ఘాయ్, సోనాలి బింద్రె  తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement