
ముంబై: గాన కోకిల లతా మంగేష్కర్ నివాసాన్ని బీఎంసీ(బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్) అధికారులు శనివారం సీల్ చేశారు. వివరాల్లోకి వెళితే.. ఇప్పటికే ముంబైలో కరోనా వైరస్ తీవ్రత అధికంగా ఉంది. అందులోనూ వైరస్ యుక్త వయసు వారికన్నా కూడా వృద్ధులకు ప్రమాదకరంగా పరిణమించింది. దీంతో లతా మంగేష్కర్ నివాసం ఉంటున్న ప్రభకుంజ్‌లో వయో వృద్ధులు ఎక్కువగా ఉండటంతో ఆ భవనాన్ని సీల్ చేశారు. కేవలం వారి సంక్షేమం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. (చదవండి: హీరోయిన్‌ను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు)
ఈ విషయంపై గాయని కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. "భవనాన్ని సీల్ చేసిన విషయాన్ని అధికారులు మాకు ఫోన్ చేసి చెప్పారు. మేమంతా క్షేమంగా ఉన్నాం. ముందుజాగ్రత్త చర్యలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారు. దేవుడి దయ, అభిమానుల ఆశీర్వాదం వల్ల మా కుటుంబం అంతా సురక్షితంగా ఉంది అని చెప్పుకొచ్చారు". కాగా ఇప్పటికే బాలీవుడ్‌లో అమితాబ్ బచ్చన్ కుటుంబం కరోనా బారిన పడి కోలుకున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో అమితాబ్ భవనాన్ని కూడా కొద్దిరోజులపాటు అధికారులు సీల్ చేశారు. (చదవండి: ‘ఇండియా నైటింగేల్‌ను కోల్పోయామా?’)
Comments
Please login to add a commentAdd a comment