
లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ మరణవార్తను ఆమె అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. లతా జీ మృతితో ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. కొన్నివేల పాటలతో సంగీత ప్రియులను మైమరిపించిన లతా జీ అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ముంబైలోని శివాజీ పార్కులో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.
కాగా గత రెండు రోజులుగా లతా మంగేష్కర్‌కు సంబంధించిన పలు కథనాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో లతా జీకి సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్న లతా మంగేష్కర్ ఓ ఇంటర్వ్యూలో.. మళ్లీ జన్మంటూ ఉంటే లతా మంగేష్కర్‌గా పుట్ట కూడదని అనుకుంటున్నాను. ఎందుకంటే లతా మంగేష్కర్ జీవితంలో ఎన్ని కష్టాలున్నాయన్నది ఆమెకు మాత్రమే తెలుసు అంటూ లతాజీ చెప్పిన మాటలు అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి.
చదవండి: లతా మంగేష్కర్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment