
నరేంద్ర మోడీకి లతా మంగేష్కర్ ప్రశంసలపై వివాదం
భారతరత్న, గానకోకిల లతా మంగేష్కర్ బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని ప్రశంసించడం వివాదాస్పదమైంది.
భారతరత్న, గానకోకిల లతా మంగేష్కర్ బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని ప్రశంసించడం వివాదాస్పదమైంది. దేశ అత్యున్నత పౌరపురస్కార గ్రహీత మతతత్వవాదిని ప్రశంసించడం విచారకరమని ముంబై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జనార్దన్ చందూర్కర్ అన్నారు. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని జనార్దన్ డిమాండ్ చేశారు. ఆయన లతా మంగేష్కర్ పేరును ప్రస్తావించకుండానే ఈ వ్యాఖ్యలు చేశారు.
గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని ప్రధానిగా చూడాలనివుందని లతా ఇటీవల వ్యాఖ్యానించారు. దేశ అత్యున్నత పురస్కార గ్రహీతలందరూ మతతత్వ రాజకీయాలను ప్రోత్సహించరాదని ముంబై కాంగ్రెస్ నాయకుడు పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలపైనా అభిమానంతో మెలగాలని, కులమతాలకు అతీతంగా వారిని ఆరాధిస్తారని చెప్పారు.