
లతా మంగేష్కర్ కు అవార్డు
లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ కు బంగవిభూషణ్ అవార్డును పశ్చిమ బెంగాళ్ ప్రభుత్వం ప్రకటించింది.
కోల్ కతా: లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ కు బంగవిభూషణ్ అవార్డును పశ్చిమ బెంగాళ్ ప్రభుత్వం ప్రకటించింది. బెంగాళ్ భాషలో లత పాడిన పాటలకు గాను ఈ అవార్డును ఆమెకు ఇస్తున్నట్టు సీఎం మమతా బెనర్జీ సెక్రటేరియట్ లో మీడియా ప్రతినిధులతో తెలిపారు. తాను స్వయంగా ముంబైలోని లత ఇంటికి వెళ్లి అవార్డును బహూకరిస్తానని మమత చెప్పారు.
ప్రభుత్వం 2011 నుంచి ఈ అవార్డును ఇస్తుంది. గతంలో ఈ అవార్డును సరోద్ విధ్వాంసుడు అమ్జద్ అలీఖాన్, గాయకుడు మన్నాడే, రచయిత్రి మహాశ్వేతా దేవి, హాకీ క్రీడాకారుడు లెస్లీ క్లాడియస్, చిత్రకారుడు జోగన్ చౌదరి, రచయిత శీర్షేంద్రు ముఖో పాధ్యాయ, చిత్ర నిర్మాత గౌతమ్ ఘోష్, సౌరబ్ గంగూలీలు అందుకున్నారు.