
ఆశాభోంస్లే కొడుకు మృతి
బాలీవుడ్ సంగీత దర్శకుడు, ప్రముఖ గాయని ఆశాభోంస్లే తనయుడు అయిన హేమంత్ భోంస్లే క్యాన్సర్ తో మరణించారు. గత మూడు సంవత్సరాలుగా క్యాన్సర్ తో పోరాడుతున్న హేమంత్.. స్కాట్లాండ్ లో మరణించారు. హేమంత్ 'నజరానా ప్యార్ కా', 'శ్రద్ధాంజలి' లాంటి బాలీవుడ్ సినిమాలకు సంగీతం అందించారు.
లతా మంగేష్కర్ 86వ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించాలనుకుంటున్న సమయంలో ఇలా జరగటంతో ఆ వేడుకలను కూడా రద్దు చేసుకున్నారు. 2012లో ఆశాభోంస్లే కూతురు వర్షా భోంస్లే డిప్రెషన్ కారణంగా ఆత్యహత్య చేసుకుంది.