
లతాజీ ఆదివారం మరణిస్తే ఇంత ఆలస్యంగా స్పందిస్తారా? అని నెటిజన్లు ఆమెను చెడామడా తిడుతున్నారు. మీకీవార్త ఇప్పుడు తెలిసిందా? అని ఫైర్ అవుతున్నారు. అయితే ఐశ్వర్య ఫ్యాన్స్ మాత్రం ఆమెను వెనకేసుకొస్తున్నారు..
గానకోకిల, భారతరత్న గ్రహీత లతా మంగేష్కర్ మరణవార్త సంగీతప్రియులనే కాదు యావత్ ప్రజానీకాన్ని శోకసంద్రంలో ముంచివేసింది. ఆమె లేని లోటును ఎవరూ పూడ్చలేరంటూ పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటించారు. ఈ క్రమంలో బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ కాస్త ఆలస్యంగా నివాళులు అర్పించింది. మీ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానంటూ ఆమె ఫోటోను మంగళవారం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.
లతాజీ ఆదివారం నాడు (ఫిబ్రవరి 6న) మరణిస్తే ఇంత ఆలస్యంగా స్పందిస్తారా? అని నెటిజన్లు ఆమెను చెడామడా తిడుతున్నారు. ఏంటి, ఇప్పుడు నిద్ర లేచారా? మీకీవార్త ఇప్పుడు తెలిసిందా? అని ఫైర్ అవుతున్నారు. అయితే ఐశ్వర్య ఫ్యాన్స్ మాత్రం ఆమెను వెనకేసుకొస్తున్నారు. తను ఎక్కువగా ఫోన్ వాడదని, అందువల్లే లేట్‌గా పోస్ట్ పెట్టి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు.