బాలీవుడ్ ప్రముఖ గాయని లతా మంగేష్కర్ తన మాతృభాష మరాఠీ అయినప్పటికీ గాయనిగా తన కెరీర్‌లో అనేక భాషల్లో పాడారు. ప్రధాని నరేంద్రమోదీ తల్లి హీరాబెన్‌కి లతా దీదీ తొలిసారిగా గుజరాతీ భాషలో లేఖ రాశారు. ఆ లేఖలో లతా దీదీ..."జూన్ 2019 సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోదీ అఖండ విజయం సాధించి వరుసగా రెండోసారి ప్రధాన మంత్రి అయినందుకు మీ కొడుకు, నా సోదరుడికి అభినందనలు. నేను గుజరాతీలో తొలిసారిగా లేఖ రాస్తున్న ఏదైన తప్పు ఉంటే నన్ను క్షమించండి" అని గాయని లతా మంగేష్కర్ గుజరాతీలో లేఖ రాశారు. లతా ఆ లేఖలో ప్రధాని మోదీని సోదరుడిగా తనను హీరాబెన్ పెద్ద కూమార్తెగా సంభోదించడం విశేషం.
2013లో ప్రధాని మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, తన తండ్రి దీనానాథ్ మంగేష్కర్ స్మారకార్థం నిర్మించిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించేందుకు లతా మంగేష్కర్ మోదీని ఆహ్వానించారు. అంతేకాదు ఆ కార్యక్రమంలో మోదీని ప్రధానిగా చూడాలనుకుంటున్నాను అని అన్నారు. పైగా 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు కూడా అదే మాట అన్నారు. ఈ మేరకు ఈ ఘటనలకు సంబంధించిన వీడియోలను ప్రధాని అధికారిక వెబ్‌సైట్ పోస్ట్ చేయడమే కాక నరేంద్ర మోదీతో లతా మంగేష్కర్‌కు గల అనుబంధానికి సంబంధించిన విషాయాలను వెల్లడించింది.
లతా దీదీకి ప్రధాని మోదీ అంటే చాలా ఇష్టం అని వెబ్‌సైట్ పేర్కొంది. ఆమె అతన్ని ముద్దుగా 'నరేంద్ర భాయ్' అని పిలిచేదని, ఇద్దరూ ఒకే నెలలో పుట్టినరోజు జరుపుకున్నారని తెలిపింది. ఆమె ప్రతి సంవత్సరం రక్షా బంధన్ రోజు శుభాకాంక్షలు తెలపడమే కాక రాఖీని పంపిచేవారు. అయితే 202లో కరోనా మహమ్మారీ కారణంగా మోదీకి రాఖీ పంపలేకపోతున్ననంటూ లతా మంగేష్కర్ ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి మోదీ స్పందనగా ..."మీ హృదయపూర్వక సందేశం నాకు అనంతమైన శక్తిని ప్రసాదిస్తుంది. మీరు ఆరోగ్యంగా సుదీర్ఘకాలం జీవించాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను" అని అన్నారు.
(చదవండి: రాజ్యసభలో లతా మంగేష్కర్‌కు నివాళి)
Comments
Please login to add a commentAdd a comment