లతా మంగేష్కర్కు బాలీవుడ్ ప్రముఖుల అభినందన | Amitabh Bachchan, Hema Malini wishes to Lata Mangeshkar | Sakshi
Sakshi News home page

లతా మంగేష్కర్కు బాలీవుడ్ ప్రముఖుల అభినందన

Sep 28 2013 3:57 PM | Updated on Apr 3 2019 7:03 PM

లతా మంగేష్కర్కు బాలీవుడ్ ప్రముఖుల అభినందన - Sakshi

లతా మంగేష్కర్కు బాలీవుడ్ ప్రముఖుల అభినందన

గానకోకిల లతా మంగేష్కర్ 85వ ఏట ప్రవేశించారు. శనివారం ఆమె జన్మదినం. బాలీవుడ్ సహా పలు ప్రాంతీయ బాషా చిత్రాల్లో దశాబ్దాల పాటు గానం చేసిన లత భారత సినీ పరిశ్రమలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు.

గానకోకిల లతా మంగేష్కర్ 85వ ఏట ప్రవేశించారు. శనివారం ఆమె జన్మదినం. బాలీవుడ్ సహా పలు ప్రాంతీయ బాషా చిత్రాల్లో దశాబ్దాల పాటు గానం చేసిన లత భారత సినీ పరిశ్రమలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. జన్మదినం సందర్భంగా పలువురు బాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు.

లతాజీ నిండునూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించి, మరిన్ని పాటలు పాడాలని సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, డ్రీమగర్ల్ హేమమాలిని అభిలషించారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో విద్యాబాలన్, మిఖా సింగ్ తదితరులున్నారు. 1942లో 13 ఏళ్ల వయసులో కెరీర్ ఆరంభించిన లతా మంగేష్కర్ 'భారత గానకోకిల'గా అభిమానులకు సుపరిచితురాలు. సినీ పరిశ్రమలో ఏడు దశాబ్దాల నుంచి గాయనిగా కొనసాగుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement