ధడక్... ఇప్పుడు నలుగురి కళ్లల్లో మెదులుతున్న సినిమా! ప్రఖ్యాత హిందీ గాయని లతామంగేష్కర్ నోటా ధడక్ మాట వినపడింది. అంతేకాదు.. జాన్వీకి ప్లేబ్యాక్ పాడాలనుంది అని కూడా చెప్పారు. ‘సాధారణంగా నేను సినిమాలు చూడను. జాన్వీ సినిమా ధడక్ చూశా. ఆ అమ్మాయికి మంచి భవిష్యత్ ఉంది. జాన్వీకి నేపథ్యం పాడాలనుకుంటున్నాను’ అన్నారు. ఈ సందర్భంగానే అనిల్ కపూర్ నటిస్తున్న ‘ఫనే ఖాన్’ ట్రైలర్‌నూ చూశారు లతా. ‘బోనీ, అనిల్... మొదటి నుంచి మా మంగేష్కర్ కుటుంబానికి చాలా దగ్గర. ఇన్‌ఫాక్ట్ నేనంటే చాలా అభిమానం. అనిల్‌కైతే మరీను. అనిల్ అంటే మా ఇంట్లో కూడా అందరికీ ఇష్టం. ధడక్ సినిమాతో బోనీ మొహంలో నవ్వు చూశాను. శ్రీదేవి మరణంతో చాలా కుంగిపోయాడు. బోనీ మళ్లీ మామూలు మనిషవుతోంది జాన్వీ వల్లే.
ఆ పిల్ల సినిమాతో అతనిలో మళ్లీ కొంత హుషారు కనిపించింది’ అంటూ కపూర్స్ ఫ్యామిలీ మీద ఉన్న అభిమానాన్ని వెలిబుచ్చారు లతామంగేష్కర్. ‘ఫన్నేఖాన్’ సినిమాలో అనిల్‌కపూర్ పాత్ర లతామంగేష్కర్, మహ్మద్‌రఫీ అభిమానిగా ఉంటుంది. ఆ పాత్ర తన కూతురిని లతా మంగేష్కర్‌లా చేయాలని అనుకుంటుంది. ఇదీ ఆ సినిమా లైన్. ‘నా పన్నెండో ఏట సినిమా నేపథ్య గాయనిగా కెరీర్ స్టార్ట్ చేశాను. అప్పటికీ ఇప్పటికీ ప్రేక్షకుల్లో సినిమారంగంలో నా పట్ల అదే అభిమానం. అది నా అదృష్టం. ఈ సందర్భంగా దేశంలోని సింగర్స్ అందరికీ నేనొక మాట చెప్పదల్చుకున్నాను.. ఇంకో కిషోర్ కుమార్‌లాగో.. రఫీలాగో.. లతాలాగో కాకండి.. మీలా మీరుండండి.. మమ్మల్ని ఇమిటేట్ చేయకండి.. మీ స్వరం ప్రత్యేకతను చాటుకోండి’ అని సలహా ఇచ్చారు లతామంగేష్కర్.
జాన్వీకి పాడాలనుంది!
Published Tue, Jul 24 2018 12:10 AM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment