Lata Mangeshkar Brother On Shivaji Park Memorial Controversy: దివంగత దిగ్గజ గాయని లతా మంగేష్కర్ పేరిట స్మారక చిహ్నం నిర్మించే విషయం ఇప్పుడు రాజకీయంగా దుమారం రేపుతోంది. ఆమెకు అంత్యక్రియలు నిర్వహించిన.. ముంబై శివాజీ పార్క్ వద్దే మెమోరియల్ నిర్మించాలంటూ బీజేపీ పట్టుబడుతుండగా.. అధికార శివసేన అందుకు సుముఖంగా లేదు. శివాజీ పార్క్ వద్ద మెమోరియల్ నిర్మించాలంటూ ఆమె కుటుంబ సభ్యుల కోరికగా మొదలైన ప్రచారం.. ఈ రగడకు కారణమైంది.
బీజేపీ ఎమ్మెల్యే రామ్ కదమ్.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రేకు ఓ లేఖ రాశారు. ఎక్కడైతే ఆమె అంత్యక్రియలు నిర్వహించారో.. అక్కడే స్మారకం నిర్మించాలంటూ డిమాండ్ చేశాడు. ఇది ఆమె కుటుంబ సభ్యుల కోరిక అంటూ ఆయన లేఖలో పేర్కొన్నారు. ఆ వెంటనే మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోల్.. ఈ డిమాండ్‌కు మద్దతు ఇచ్చారు. ఆౕ వెంటనే మిత్రపక్షం(మహా వికాస్ అగాధి) శివసేన ఒత్తిడితో ఆ డిమాండ్‌పై స్వరం మార్చారు నానా.
ఇక బీజేపీ డిమాండ్‌పై అధికార శివసేన సుముఖంగా లేదు. అందుకు కారణం.. ఆ పార్క్‌తో ఉన్న అనుబంధం. బాల్ థాక్రే హయాం నుంచే సుమారు 28 ఎకరాల ఈ పార్క్ నుంచి దసరా ర్యాలీని ఆనవాయితీగా నిర్వహిస్తున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే కూడా ఆ ఆనవాయితీని కొనసాగిస్తున్నారు. ఈ సెంటిమెంట్ నేపథ్యంలోనే లతాజీ మెమోరియల్ నిర్మాణం డిమాండ్‌పై మౌనం పాటిస్తోంది.
ఇక ఈ డిమాండ్..అభ్యంతరాల నడుమ పలు పార్టీలు సైతం స్పందిస్తున్నాయి. మహారాష్ట్ర నవ్‌నిర్మాణ్ సేనా9MNS) నేత సందీప్ దేశ్‌పాండే ఈ వ్యవహారంలో రాజకీయాలు తగవని అంటున్నారు. దాదర్ ప్రజలు ఈ పార్క్ ఆక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకు.. సంరక్షించుకునేందుకు ఎంతో కృషి చేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో రాజకీయాలు తగవు అంటూ సందీప్ ట్వీట్ చేశారు. ఎందరో క్రికెటర్లను తీర్చిదిద్దిన ఈ మైదానంపై రాజకీయం తగదని పలు సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. అయినప్పటికీ బీజేపీ పట్టువీడడం లేదు.
ఇక శివసేన ప్రభుత్వం మాత్రం లతా మంగేష్కర్ గౌరవార్థం కాళినలో ఒక అంతర్జాతీయ సంగీత అకాడమీని నెలకొల్పేందుకు నిర్ణయించుకుంది. ఇందుకోసం 2.5 ఎకరాల స్థలం, సుమారు 1,200 కోట్ల ఖర్చును అంచనా వేసింది. ఈ నిర్ణయం ఆమెకు సరైన నివాళి అంటున్నారు ఆమె సోదరుడు హృదయనాథ్ మంగేష్కర్.
లతా మంగేష్కర్ మెమోరియల్ డిమాండ్‌పై ఆమె సోదరుడు, సంగీతకారుడు హృదయనాథ్ మంగేష్కర్ స్పందించారు. శివాజీ పార్క్ వద్ద మెమోరియల్ నిర్మించాలన్నది తమ కుటుంబ డిమాండ్ కాదని, దయచేసి వివాదానికి పుల్‌స్టాప్ పెట్టాలని ఆయన కోరారు. ఈ వ్యవహారాన్ని రాజకీయం చేయడం దయచేసి ఆపండి. అలాంటి డిమాండ్ మా కుటుంబం నుంచి రాలేదు. అది మా అభిమతం కూడా కాదు అని ఆయన స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment