Urmila Matondkar Reacts on Shah Rukh Khan Viral Video at Lata Mangeshkar Funeral - Sakshi
Sakshi News home page

Urmila Matondkar: షారుక్‌ వీడియోపై సీనియర్‌ నటి ఊర్మిళ స్పందన, ఇలాంటి సమాజంలో బతుకుతున్నామా?

Published Tue, Feb 8 2022 5:24 PM | Last Updated on Wed, Feb 9 2022 8:56 AM

Urmila Matondkar Reacts On Shah Rukh Khan Viral Video At Lata Mangeshkar Funeral - Sakshi

లెజెండరి సింగర్‌, గాన కొకిల లతా మంగేష్కర్‌ అంత్యక్రియల్లో బాలీవుడ్‌ ‘బాద్‌షా’ షారుక్‌ ఖాన్‌ నివాళులు అర్పిస్తుండగా ఉమ్మివేసిన వీడియో నెట్టింట తీవ్ర చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. ఆమె అంత్యక్రయల్లో తన మేనేజర్‌తో కలిసి హజరైన షారుక్‌ లతాజీ భౌతికఖాయం వద్ద ముస్లిం పద్దతిలో నమస్కారం చేస్తూ ప్రార్థించాడు. అనంతరం మాస్క్‌ తీసి ఉమ్మాడు. దీంతో షారుక్‌పై నెటిజన్లు తీవ్రంగా విరుచుకుపడ్డారు.

చదవండి: అవును.. బాయ్‌ఫ్రెండ్‌ ఉన్నాడు, అతనెవరో చెప్పేస్తా.. కానీ: హీరోయిన్‌

లతాజీ కాళ్ల వద్ద ఉమ్మి షారుక్‌ ఆమెను అవమాన పరిచారంటూ నెటిజన్లు ఆయనను విమర్శించడం ప్రారంభించారు. దీంతో ఈ ట్రోల్స్‌పై స్పందించిన కొందరు ఇది ముస్లిం ప్రార్థనలో భాగమంటూ అసలు సంగతి వివరించారు. ఈ క్రమంలో షారుక్‌కు పలువురు నటీనటులు మద్దతుగా నిలుస్తారు. తాజాగా సీనియర్‌ నటి ఊర్మిళ మాటోండ్కర్‌ కూడా షారుక్‌కు మద్దతుగా నిలిచింది.

చదవండి: వెనక్కి తగ్గిన సరయూ, కాసేపట్లో పోలీస్‌ స్టేషన్‌కు పిటిషనర్‌..

ఈ సందర్భంగా ఆమె తీవ్రంగా మండిపడింది. ఈ మేరకు ఊర్మిళా మాట్లాడుతూ... ప్రార్థనను కూడా ఉమ్మివేయడం అనుకునే సమాజంలో మనం బ్రతుకుతున్నామంటూ అసహనం వ్యక్తం చేసింది. ఇండియన్‌ సినిమాను అంతర్జాతీయ ఫార్మేట్‌లో నిలబెట్టిన షారుక్‌పై ఇలాంటి నెగిటివ్‌ కామెంట్స్‌ చేయడం బాధించిందంటూ ఊర్మిళ వ్యాఖ్యానించింది. కాగా ఇండియన్‌ నైటింగల్‌గా పేరు తెచ్చుకున్న గాయని లతా మంగేష్కర్‌ ఆదివారం ఉదయం అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement