సచిన్ భారత రత్నకు అర్హుడు: లతా మంగేష్కర్
భారత అత్యున్నత పురస్కారం భారత రత్నకు మాస్టర్ బ్లాస్టర్ అర్హుడు అని ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ అభిప్రాయపడ్డారు. మరేవరూ సాధించలేని విధంగా దేశం కోసం సచిన్ క్రీడా రంగానికి సేవలందించారు అని ఆమె అన్నారు. సచిన్ మరో సంవత్సరం పాటు ఆడితే బాగుండేదని ఆమె అన్నారు. తొలి ఇన్నింగ్స్ సచిన్ ఆడిన తీరు చూస్తే మరో రెండేళ్లపాటు ఆడే సత్తా ఉంది అని లతా మంగేష్కర్ వ్యాఖ్యానించారు.
'రిటైర్మెంట్ తర్వాత సచిన్ క్రికెట్ అకాడమి ఏర్పాటు చేయాలి. తనలో ఉన్న అద్భుత ప్రతిభను భావితరం క్రికెటర్లు అందించాలి' అని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. కెరీర్ లో చివరి మ్యాచ్ ఆడుతున్న సచిన్ వెస్టిండీస్ తో జరుగుతున్న మ్యాచ్ లో 74 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.