గానకోకిలకు మోదీ శుభాకాంక్షలు | Modi wishes Lata Mangeshkar on 87th birthday | Sakshi
Sakshi News home page

గానకోకిలకు మోదీ శుభాకాంక్షలు

Published Wed, Sep 28 2016 11:00 AM | Last Updated on Tue, Aug 21 2018 9:33 PM

గానకోకిలకు మోదీ శుభాకాంక్షలు - Sakshi

గానకోకిలకు మోదీ శుభాకాంక్షలు

న్యూఢిల్లీ: భారతరత్న, లెజెండరీ సింగర్ లతామంగేష్కర్కు  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 87వ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.మెలోడీ క్వీన్ లతామంగేష్కర్ భారతదేశ అత్యంత గౌరవనీయ గాయకురాలని, ఆమె నిండునూరేళ్లు జీవించాలని  మోదీ ట్విట్టర్లో పోస్టు చేశారు. ఆమెకు ఫోన్ చేసిన మోదీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు  తెలిపారు.

లతామంగేష్కర్ 1928 లో మహారాష్ట్ర్రలో జన్మించారు.ఏడు దశాబ్దాలుగా సినిమాల్లో పాటలు పాడుతున్నారు.ప్రపంచంలో అత్యధిక పాటలు పాడిన గాయకురాలిగా గిన్నీస్ రికార్డులో చోటు సంపాదించారు. భారత ప్రభుత్వం 2001 లో భారతరత్న అవార్డుతో ఆమెను సత్కరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement