Why Lata Mangeshkar Never Got Married Here Is The Reason - Sakshi
Sakshi News home page

Lata Mangeshkar : లతాజీ ఎందుకు వివాహం చేసుకోలేదు? పెళ్లిపై ఆమె ఏమన్నారంటే..

Published Sun, Feb 6 2022 3:55 PM | Last Updated on Sun, Feb 6 2022 6:08 PM

Why Lata Mangeshkar Never Got Married Here Is The Reason - Sakshi

Why Lata Mangeshkar Never Got Married Here Is The Reason: భారత సినీ సంగీత ప్రపంచంలో ఓ శిఖరం నేలకొరిగింది. దిగ్గజ గాయని, భారతరత్న లతా మంగేష్కర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది. లతా జీ మరణం యావత్‌ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. కోట్లాది అభిమానుల సంగీత దేవతగా ఆమె ఆరాధించబడిన లతా మంగేష్కర్‌ జీవితం ఎంతో స్పూర్తిదాయకం.

చరిత్ర పుటల్లో చిరస్థాయిగా మిగిలిపోయిన ఆమె కీర్తి ఎనలేనిది. అయితే ఆమె వ్యక్తిగత జీవితం మాత్రం అసంపూర్ణంగానే మిగిలిపోయింది. ఈ లెజెండరీ సింగర్‌ ఎందుకు పెళ్లి చేసుకోలేదనే ప్రశ్న అభిమానుల్లో మిగిలిపోయింది. దీనిపై ఓ ప్రముఖ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో లతాజీ సమాధానమిచ్చింది. 'జీవితంలో ప్రతిదీ దేవుడి నిర్ణయం ఆధారంగానే జరుగుతుంది. ఏం జరిగినా అది మన మంచి కోసమే అనుకోవాలి.

పెళ్లి వద్దనుకునే ఆడపిల్లలు కూడా ఉంటారా? అనే ఈ  ప్రశ్న ఓ నలభై ఏళ్ల క్రితం అడిగి ఉంటే నా సమాధానం మరోలా ఉండేదేమో. ఈ వయసులో అలాంటి ఆలోచలకు తావు లేదు.. అంటూ ఆమె సమాధానం చెప్పారు. ఈ ఇంటర్వ్యూ నాటికి లతాజీ వయసు 82 సంవత్సరాలు. అంతేకాకుండా పెళ్లిపై లతాజీ చేసిన మరొక కామెంట్‌ ఏంటంటే.. కుటుంబంలో పెద్ద అమ్మాయిని కావడం తండ్రి చనిపోయాక 13ఏళ్ల వయసు నుంచే కుటుంబ బాధ్యతని భుజాన వేసుకున్నాను. ఓ దశలో పెళ్లి చేసుకోవాలనే ఆలోచన వచ్చినప్పటికీ ఈ కారణంగా కుదరలేదు' అని వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement