సెప్టెంబర్ 28న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు | On September 28, the birthday celebration is buying Celebrities | Sakshi
Sakshi News home page

సెప్టెంబర్ 28న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు

Published Sun, Sep 27 2015 11:21 PM | Last Updated on Fri, Mar 22 2019 1:53 PM

సెప్టెంబర్  28న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు - Sakshi

సెప్టెంబర్ 28న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు

ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు: లతా మంగేష్కర్ (గాయని)
పూరి జగన్నాథ్ (డైరక్టర్), రణబీర్ కపూర్ (నటుడు)

 
ఈరోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 9. ఇది కుజసంఖ్య. దీనివల్ల మీ మీద ఉన్న చెడు ప్రభావం అంటే చెడుస్నేహాల వ ంటి దుర్గుణాల నుండి విముక్తి కలిగి కొత్త జీవితం ప్రారంభిస్తారు. మీరు పుట్టిన తేదీ 28. ఇది సూర్యసంఖ్య. నవగ్రహాలలో సూర్యుడు రాజు, కుజుడు సేనాపతి అవడం వల్ల ఈ సంవత్సరం అవివాహితులకు వివాహం అవడం, సంతానప్రాప్తి కలగడం, సొంతు ఇంటి కల నెరవేరడం వంటి మంచి మార్పులు కలుగుతాయి. వచ్చే పుట్టిన రోజు వరకు మీ పుట్టిన రోజు, ఈ సంవత్సరం మీరు తలచిన పనులు ఆటంకాలు లేకుండా విజయవంతమవుతాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగాలు, మైన్స్, మెకానికల్, మెటీరియల్ రంగాలలో ఉన్న వారికి ఊహించని లాభాలు వస్తాయి. కుజప్రభావం వల్ల పై అధికారులతో, యజమానులతో మొండిగా వాదించి గొడవలు పడి, ఉన్న ఉద్యోగాన్ని ఊడగొట్టుకునే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. అలాగే వాహనాలను నడపడంలోనూ, మారణాయుధాల వాడకంలోనూ అప్రమత్తంగా ఉండటం అవసరం.

 లక్కీ నంబర్స్: 1,3,6,9; లక్కీ కలర్స్: రోజ్, ఆరంజ్, రెడ్, పర్పుల్; లక్కీ డేస్: ఆది, సోమ, మంగళ, శుక్రవారాలు. సూచనలు: సుబ్ర హ్మణ్యేశ్వరునికి అభిషేకం, సూర్యారాధన, తండ్రిని కాని, తండ్రితో సమానులైన వారిని కానీ ఆదరించడం, పేదరోగులకు ఆహార పంపిణీ చేయడం మంచిది.
 - డాక్టర్ మహమ్మద్ దావూద్
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement