
మ్యాస్ట్రో ఎ.ఆర్.రెహ్మాన్ అభిమాన గాయకురాలిగా గుర్తింపు పొందిన ప్రముఖ నేపథ్య గాయని రోంకిణి గుప్తా నగరంలో తన సంగీత ప్రదర్శన శనివారం నిర్వహిస్తున్నారు. తెలంగాణ టూరిజంతో కలిసి సాయంత్రం 6.30 గంటలకు మాసబ్ ట్యాంక్ సమీపంలోని జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్శిటీ (జెఎన్‌ఎఎఫ్‌ఎయు) ఆడిటోరియంలో రోంకిణి గుప్తా హిందుస్థానీ క్లాసికల్ సంగీతాన్ని సుర్మండల్ పేరిట అందించనున్నారు. మూడు సార్లు ఉత్తమ మహిళా నేపథ్య గాయనిగా నామినేట్ అయిన రోంకిణి గుప్తా ఇటీవల స్వర కోకిల లతా మంగేష్కర్ అవార్డును సైతం అందుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment