
సంగీత సామ్రాట్, దిగ్గజ సంగీత దర్శకుడు ఏఆర్ రహమాన్ వివాహ బంధానికి బ్రేక్ పడింది. 29 సంవత్సరాల వివాహ బంధాన్ని ముగిస్తూ తన భార్య నుంచి సైరా భాను నుంచి విడాకులు పొందారు

ఈ విషయాన్ని రహమాన్ దంపతుల తరఫున ప్రముఖ విడాకుల లాయర్ వందనా షా ఒక సంయుక్త ప్రకటన మంగళవారం విడుదలచేశారు

‘‘పెళ్లయిన చాన్నాళ్ల తర్వాత విడిపోవాలన్న కఠిన నిర్ణయానికి వచ్చారు. కొరవడిన భావోద్వేగాలే బంధం బీటలు పడటానికి కారణం

రహమాన్, సైరా బానూ వివాహం 1995 మార్చిలో చెన్నైలో జరిగింది. వీళ్లకు ఖతీజా, రహీమా, అమీన్ అనే పిల్లలున్నారు. వీళ్లది పెద్దలు కుదిర్చిన వివాహం
















