శృతిహాసన్ ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయింది. గతేడాది చిరు, బాలయ్యతో మొదలుపెట్టి.. చివర్లో ప్రభాస్ 'సలార్'తో హిట్ కొట్టి 2023ని ముగించింది. ప్రస్తుతానికైతే కొత్త మూవీస్ ఏం చేయట్లేదు. అలా అని ఖాళీగా లేదని చెప్పొచ్చు. అప్పుడెప్పుడో పక్కనబెట్టేసిన పాత ప్రొఫెషన్‌ని తిరిగి ఇప్పుడు మొదలుపెట్టేసింది.
(ఇదీ చదవండి: శ్రీలీలని ఇలా ఎప్పుడూ చూసుండరు.. వీడియో వైరల్)
విలక్షణ నటుడు కమల్ హాసన్ వారసురాలిగా శ్రుతిహాసన్ చాలామందికి తెలుసు. గాయనిగా కెరీర్ ప్రారంభించిన ఈమె.. హీరోయిన్ కాకముందు పలు ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ చేసింది. తండ్రి కమల్ 'ఉన్నైపోల ఒరువన్' సినిమాతో సంగీత దర్శకురాలు అయింది. ఆ తర్వాత నటిగా మారడంతో పాడటాన్ని పక్కనబెట్టేసింది.
తాజాగా ఇప్పుడు మరోసారి తనలోని సింగర్‌ని శ్రుతిహాసన్ బయటకు తీయబోతుంది. జయం రవి, నిత్యామేనన్ నటిస్తున్న ఓ తమిళ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతమందిస్తున్నారు. ఇందులో 'కాదలిక్క నేరమిల్‌లై' అనే పాటని శ్రుతిహాసన్ పాడనుంది. అలా యాక్టింగ్ పరంగా ఛాన్సులు రాకపోతేనేం.. మళ్లీ సింగర్‌గా బిజీ అయిపోతోంది.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ థ్రిల్లర్ మూవీ.. తెలుగు స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)
Comments
Please login to add a commentAdd a comment