హీరోయిన్ శ్రుతిహాసన్ డేరింగ్ స్టెప్.. ఫైనల్‌గా ఇన్నాళ్లకు? | Shruti Haasan Acts In Velu Nachiyar Biopic Movie, Interesting Deets Inside - Sakshi
Sakshi News home page

Shruthi Haasan In Velu Nachiyar Biopic: శ్రుతిహాసన్ డేరింగ్ స్టెప్.. వర్కౌట్ అయ్యే పనేనా?

Published Sat, Jan 27 2024 3:38 PM | Last Updated on Sat, Jan 27 2024 3:58 PM

Shruti Haasan Acts In Velu Nachiyar Biopic Movie - Sakshi

విలక్షణ నటుడు కమల్ హాసన్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి వచ్చిన శ్రుతిహాసన్.. కెరీర్ ప్రారంభంలో చాలా ఎదురుదెబ్బలు ఫేస్ చేసింది. ఆ తర్వాత పలు సినిమాలతో హీరోయిన్‌గా మంచి పేరు సంపాదించింది. చెప్పాలంటే గతేడాది తెలుగులో ఈమె చేసిన సినిమాలన్నీ హిట్ అయ్యాయి. దీంతో లక్కీ హీరోయిన్ అయిపోయింది. సరిగ్గా ఇలాంటి సమయంలో కెరీర్ పరంగా డేరింగ్ స్టెప్ తీసుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. 

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. మీరు చూశారా?)

గతేడాది తెలుగులో 'వీరసింహారెడ్డి', 'వాల్తేరు వీరయ్య', 'సలార్‌', 'హాయ్‌ నాన్న' (గెస్ట్‌ రోల్‌) సినిమాల్లో శ్రుతిహాసన్ నటించింది. ఇవన్నీ హిట్ అయ్యాయి. తాజాగా రవితేజ కొత్త మూవీలో నటించబోతుందని టాక్. హాలీవుడ్‌లో 'ది ఐ' అనే వెబ్‌ సీరీస్‌లోనూ శ్రుతి ఛాన్స్ కొట్టేసిందట. ఇప్పుడు మరో హాలీవుడ్‌ చిత్రం ఈమె ఖాతాలో పడినట్లు తెలుస్తోంది. ఇవన్నీ పక్కనబెడితే సొంత భాషలో దాదాపు నాలుగేళ్ల తర్వాత శ్రుతిహాసన్ నటించబోతుందట.

శ్రుతిహాసన్‌ తమిళ చిత్రాల్లో నటించి చాలా కాలమైంది. విజయ్‌సేతుపతి 'లాభం' చిత్రంలో ఈ బ్యుటీ నటించింది. 2021లో ఇది రిలీజైంది. అప్పటినుంచి సొంత భాషలో చేయని శ్రుతిని ఇప్పుడు ఓ క్రేజూ సినిమాలో ఆఫర్ కొట్టేసిందట. వేలు నాచ్చియార్‌ అనే వీరవనిత పాత్రని శ్రుతిహాసన్‌ చేయబోతుందట. స్వతంత్య్ర పోరాటంలో పాల్గొన్న తొలి తమిళ నారీమణి వేలు నాచ్చియార్‌. రాజేష్‌ ఎం.సెల్వా ఈ ప్రాజెక్ట్ తీయబోతున్నారు. ఎక్కువగా గ్లామర్ రోల్స్ చేసే శ్రుతిహాసన్.. ఈ పాత్రలో చేస్తే సినిమా వర్కౌట్ అవుతుందా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

(ఇదీ చదవండి: స్టార్ హీరో కాపురంలో చిచ్చు.. హీరోయిన్‌కి వార్నింగ్ ఇచ్చిన భార్య?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement