
ఈయన పాటలకు చెవులు కోసుకునే ప్రేక్షకులు కోకొల్లలు. ఈయన సంగీత కచేరీలకు దేశ విదేశాలలో విశేష ఆదరణ లభిస్తోంది. ఈయన పేరు కెనడాలో ప్రసిద్ధి. ఎంతగా అంటే ఆ దేశంలోని వీధులకు ఆయన పేరు పెట్టేంతగా.
ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఖ్యాతి నానాటికి పెరుగుతునే ఉంది. ఆస్కార్ అవార్డు గ్రహీత అయిన ఈయనకు అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులు ఇప్పటికే వరించాయి. విదేశాల్లోనూ ఏఆర్ రెహమాన్‌కు ఎంతో గౌరవం ఉంది. తమిళం, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషా చిత్రాలకు సంగీతాన్ని అందిస్తూ తన పాటలతో అశేష ప్రేక్షకులను అలరిస్తూ ఖ్యాతి గాంచిన ఈయన ఇప్పటికీ సంగీత దర్శకుడిగా బిజీగానే ఉన్నారు.
ఈయన పాటలకు చెవులు కోసుకునే ప్రేక్షకులు కోకొల్లలు. ఈయన సంగీత కచేరీలకు దేశ విదేశాలలో విశేష ఆదరణ లభిస్తోంది. ఈయన పేరు కెనడాలో ప్రసిద్ధి. ఎంతగా అంటే ఆ దేశంలోని వీధులకు ఆయన పేరు పెట్టేంతగా! అక్కడ మార్కెట్ అనే నగరంలోని రెండు వీధులకు ఏఆర్ రెహమాన్ పేరు పెట్టారు. 2013లో ఒక వీధికి, తాజాగా 2022లో మరో వీధికి ఏఆర్ రెహమాన్ పేరు పెట్టడం విశేషం. కాగా తమిళంలో రెహమాన్ సంగీతం అందించిన కోబ్రా, పొన్నియిన్ సెల్వన్, వెందు తనిందుదు కాడు చిత్రాలు వరుసగా విడుదలకు సిద్ధం అవుతున్నాయి.
చదవండి: మాజీ ప్రియుడితో నటి చక్కర్లు, వీడియో వైరల్
హీరోతో సహజీవనం వార్తలపై ఇస్మార్ట్ బ్యూటీ గప్‌చుప్!