music director AR rehman
-
ఏఆర్ రెహమాన్‌కి విడాకులు ఇచ్చేసిన భార్య
సంగీత సామ్రాట్, దిగ్గజ సంగీత దర్శకుడు ఏఆర్ రహమాన్ దంపతులు తమ మూడు దశాబ్దాల వైవాహిక బంధానికి స్వస్తి పలకబోతున్నారు. ఈ విషయాన్ని రహమాన్ దంపతుల తరఫున ప్రముఖ విడాకుల లాయర్ వందనా షా ఒక సంయుక్త ప్రకటన మంగళవారం విడుదలచేశారు. ‘‘పెళ్లయిన చాన్నాళ్ల తర్వాత విడిపోవాలన్న కఠిన నిర్ణయానికి వచ్చారు. కొరవడిన భావోద్వేగాలే బంధం బీటలు పడటానికి కారణం. ఒకరిపై ఇంకొకరికి అమితమైన ప్రేమానురాగాలు ఉన్నాసరే అనూహ్య పరిస్థితులు వీళ్లిద్దరి మధ్య పూడ్చలేని అగాథాన్ని సృష్టించాయి. బాధను దిగమింగి ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ కష్టకాలంలో వ్యక్తిగత గోప్యతను గౌరవిస్తూ ప్రజలు సైతం ఈ విషయాన్ని అర్థంచేసుకుంటారని ఆశిస్తున్నాం. ఈ కష్టమైన దశను వీళ్లిద్దరూ దాటగలరని భావిస్తున్నా’ అని లాయర్ వందనా షా ఆ అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. ‘ మా కుటుంబ ప్రైవసీని గౌరవించండి’ అని రెహమాన్ కుమారుడు అమీన్ సైతం ఇన్‌స్టా గ్రామ్‌లో ఒక పోస్ట్‌పెట్టారు. రహమాన్, సైరా బానూ వివాహం 1995 మార్చిలో చెన్నైలో జరిగింది. వీళ్లకు ఖతీజా, రహీమా, అమీన్ అనే పిల్లలున్నారు. వీళ్లది పెద్దలు కుదిర్చిన వివాహం. -
ఏఆర్ రెహమాన్ భార్యను ఎప్పుడైనా చూశారా?
ఏఆర్ రెహమాన్.. ఈ పేరే ఒక బ్రాండ్. సుమారు 30 ఏళ్ల క్రితం సంగీత దర్శకుడిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. దేశంలోనే అగ్ర సంగీత దర్శకుడిగా ఎదిగారు. తమిళం, తెలుగు, హిందీ, ఆంగ్లం సహా అనేక భాషల్లో ఆయన బాణీలు అందించారు. ఒకేసారి రెండు ఆస్కార్ అవార్డులను సాధించిన ఘనత ఈయనది. ఇప్పటికీ ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారంటే ఆ చిత్రం కచ్చితంగా మ్యూజికల్ హిట్ అనే నమ్మకం ప్రేక్షకుల్లో ఉంటుంది. ఇటీవల ఈయన సంగీతాన్ని అందించిన పొన్నియిన్ సెల్వన్, వెందు తనిందది కాడు చిత్రాలు సంచలన విజయాన్ని అందుకున్నాయి. ప్రస్తుతం పత్తుతల, పొన్నియిన్ సెల్వన్ 2, మామన్నన్, లాల్ సలాం, ఆడుజీవితం వంటి పలు చిత్రాలు ఈయన చేతిలో ఉన్నాయి. వీటిలో శింబు కథానాయకుడిగా నటించిన పత్తుతల చిత్రం ఈ నెల 30వ తేదీ తెరపైకి రానుంది. అదే విధంగా ఏప్రిల్ 28వ తేదీ పొన్నియిన్ సెల్వన్ విడుదలకు సిద్ధమవుతోంది. ఆ తరువాత మామన్నన్ చిత్రం రెడీ అవుతోంది. ఇలా ఈ ఏడాది.. నెలకో చిత్రంతో ఏఆర్ రెహమాన్ తన అభిమానులను అలరించనున్నారు. కాకపోతే ఏఆర్ రెహమాన్ సతీమణి గురించి చాలా తక్కువ మందికి తెలిసుంటుంది. ఈయన 1995 మార్చి 12వ తేదీ సైరా భానును వివాహం చేసుకున్నారు. వీరి దాంపత్య జీవితం 28 వసంతాలను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఏఆర్ రెహమాన్ తన సతీమణితో కలిసి ఉన్న ఫొటోను ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేశారు. దీంతో పలువురు వీరికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపారు. కాగా ఈ దంపతులకు ఖతీజా రెహమాన్, రహీమ రెహమాన్ అనే ఇద్దరు కుమార్తెలు, ఒమీన్ అనే కొడుకు ఉన్నారు. View this post on Instagram A post shared by ARR (@arrahman) -
మరో కెనడా వీధికి ఏఆర్ రెహమాన్ పేరు
ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఖ్యాతి నానాటికి పెరుగుతునే ఉంది. ఆస్కార్ అవార్డు గ్రహీత అయిన ఈయనకు అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులు ఇప్పటికే వరించాయి. విదేశాల్లోనూ ఏఆర్ రెహమాన్‌కు ఎంతో గౌరవం ఉంది. తమిళం, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషా చిత్రాలకు సంగీతాన్ని అందిస్తూ తన పాటలతో అశేష ప్రేక్షకులను అలరిస్తూ ఖ్యాతి గాంచిన ఈయన ఇప్పటికీ సంగీత దర్శకుడిగా బిజీగానే ఉన్నారు. ఈయన పాటలకు చెవులు కోసుకునే ప్రేక్షకులు కోకొల్లలు. ఈయన సంగీత కచేరీలకు దేశ విదేశాలలో విశేష ఆదరణ లభిస్తోంది. ఈయన పేరు కెనడాలో ప్రసిద్ధి. ఎంతగా అంటే ఆ దేశంలోని వీధులకు ఆయన పేరు పెట్టేంతగా! అక్కడ మార్కెట్ అనే నగరంలోని రెండు వీధులకు ఏఆర్ రెహమాన్ పేరు పెట్టారు. 2013లో ఒక వీధికి, తాజాగా 2022లో మరో వీధికి ఏఆర్ రెహమాన్ పేరు పెట్టడం విశేషం. కాగా తమిళంలో రెహమాన్ సంగీతం అందించిన కోబ్రా, పొన్నియిన్ సెల్వన్, వెందు తనిందుదు కాడు చిత్రాలు వరుసగా విడుదలకు సిద్ధం అవుతున్నాయి. చదవండి: మాజీ ప్రియుడితో నటి చక్కర్లు, వీడియో వైరల్ హీరోతో సహజీవనం వార్తలపై ఇస్మార్ట్ బ్యూటీ గప్‌చుప్! -
నెల్లూరులో దర్గాను దర్శించిన ఏఆర్ రెహమాన్
తడ (నెల్లూరు జిల్లా): ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఆదివారం శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా తడ మండలం వేనాడులోని షేక్ దావూద్ షావలీ అల్లా దర్గాను సందర్శించారు. మధ్యాహ్నం దర్గాకు వచ్చిన రెహమాన్ చేత దర్గా ముజావర్లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అతి తక్కువ సమయం మాత్రమే దర్గా వద్ద గడిపిన రెహమాన్ ప్రార్థన అనంతరం ఎవరితోనూ మాట్లాడకుండా వెళ్లిపోయారు. ప్రతి ఏటా గంధోత్సవం సందర్బంలో దర్గాను సందర్శించే ఆయన ఇటీవలి కాలంలో గంధోత్సవం అయిన తరువాత ఏదోఒక సందర్బంలో దర్శించుకుని వెళుతుంటారు. గంధోత్సవంలో మాత్రం రెహమాన్ సోదరి రెహానా బేగం పాల్గొంటున్నారు. దర్గాకు వచ్చిన సమయంలో ఫొటోలు తీసేందుకు ప్రయత్నించగా అందుకు ఆయన నిరాకరించారు.