తడ (నెల్లూరు జిల్లా): ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఆదివారం శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా తడ మండలం వేనాడులోని షేక్ దావూద్ షావలీ అల్లా దర్గాను సందర్శించారు. మధ్యాహ్నం దర్గాకు వచ్చిన రెహమాన్ చేత దర్గా ముజావర్లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అతి తక్కువ సమయం మాత్రమే దర్గా వద్ద గడిపిన రెహమాన్ ప్రార్థన అనంతరం ఎవరితోనూ మాట్లాడకుండా వెళ్లిపోయారు.
ప్రతి ఏటా గంధోత్సవం సందర్బంలో దర్గాను సందర్శించే ఆయన ఇటీవలి కాలంలో గంధోత్సవం అయిన తరువాత ఏదోఒక సందర్బంలో దర్శించుకుని వెళుతుంటారు. గంధోత్సవంలో మాత్రం రెహమాన్ సోదరి రెహానా బేగం పాల్గొంటున్నారు. దర్గాకు వచ్చిన సమయంలో ఫొటోలు తీసేందుకు ప్రయత్నించగా అందుకు ఆయన నిరాకరించారు.