Ponniyin Selvan Lyrical Song 'Alanai Neekai' Released - Sakshi
Sakshi News home page

Ponniyin Selvan: 'పొన్నియిన్ సెల్వన్' లిరికల్ సాంగ్ రిలీజ్.. మీరు చూశారా..!

Published Tue, Sep 20 2022 3:09 PM | Last Updated on Tue, Sep 20 2022 4:26 PM

Ponniyin Selvan Lyrical Song 'Alanai Neekai' Released  - Sakshi

దర్శకుడు మణిరత్నం ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన చిత్రం 'పొన్నియిన్ సెల్వన్'. పదో శతాబ్దంలోని చోళరాజుల ఇతివృత్తంతో ఈ మూవీని రూపొందించారాయన.  లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంస్థలు సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలోని ‘అలనై నీకై..’ అనే లిరికల్ పాటను చిత్రబృందం విడుదల చేసింది. ‘జలసఖి నేనై నిలిచా నెలరాజా..’ అంటూ సాగే ఈ పాట యూత్‌ను విపరీతంగా ఆకర్షిస్తోంది. అనంత శ్రీరామ్‌ ఈ పాటను రాయగా.. సింగర్‌ అంతరా నంది పాడారు.ఆస్కార్‌ విజేత ఏఆర్‌ రెహమాన్‌ ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చారు.

(చదవండి: Ponniyin Selvan: పొన్నియన్‌ సెల్వన్‌ నుంచి ఫస్ట్‌సాంగ్‌ అవుట్‌.. ఆకట్టుకుంటున్న లిరిక్స్‌)

ఇటీవల మొదటి భాగం షూటింగ్ పూర్తవ్వగా.. సినిమా కోసం ప్రచార కార్యక్రమాలు వేగంగా సాగుతున్నాయి.సెప్టెంబర్ 30న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మళయాళ భాషలతో పాటు ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. ప్రసిద్ధ రచయిత కల్కి రాసిన ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ అనే నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. విక్రమ్‌, కార్తి, జయం రవి, ప్రకాశ్‌ రాజ్‌, ఐశ్వర్యరాయ్‌, త్రిష ప్రధాన పాత్రల్లో నటించారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement