బిచ్చగాడు 2 డైరెక్ట్‌ చేసేది ఆయనే: హీరో | Vijay Antony About Vijay Raghavan Movie | Sakshi
Sakshi News home page

ఆ లిస్ట్‌లో మా సినిమా ఉంటుంది: విజయ్‌ ఆంటోని

Published Thu, Mar 25 2021 7:57 AM | Last Updated on Thu, Mar 25 2021 8:40 AM

Vijay Antony About Vijay Raghavan Movie - Sakshi

‘‘తెలుగు ప్రేక్షకులు కోవిడ్‌ తర్వాత కూడా సినిమాలను అద్భుతంగా ఆదరిస్తున్నారు. ‘క్రాక్, ఉప్పెన, జాతిరత్నాలు’ సహా ఎన్నో బ్లాక్‌ బస్టర్‌ చిత్రాలను అందించారు.. ఈ లిస్ట్‌లో మా ‘విజయ రాఘవన్‌’ సినిమా కూడా చేరుతుందనే నమ్మకం ఉంది’’ అని విజయ్‌ ఆంటోని అన్నారు. ఆనంద కృష్ణన్‌ దర్శకత్వంలో విజయ్‌ ఆంటోని, ఆత్మిక జంటగా నటించిన చిత్రం ‘విజయ రాఘవన్‌’.

టి.డి. రాజా, డి.ఆర్‌. సంజయ్‌ కుమార్‌ నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదలకానుంది. విజయ్‌ ఆంటోని మాట్లాడుతూ –‘‘మదర్‌ సెంటిమెంట్, ప్రేమ, రొమాన్స్‌, యాక్షన్‌.. ఇలా అన్ని ఎలిమెంట్స్‌తో ఆనంద కృష్ణన్‌ అద్భుతంగా తెరకెక్కించాడు. అందుకే నా తర్వాతి సినిమా ‘బిచ్చగాడు 2’కి ఆయనకే దర్శకత్వ బాధ్యతలను అప్పగించాను’’ అన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాతలు: కమల్‌ బోరా, లలితా ధనంజయన్, బి. ప్రదీప్, పంకజ్‌ బోరా, ఎస్‌. విక్రమ్‌ కుమార్‌. 

చదవండి: రాజ్‌తరుణ్‌.. కూర్చుంది చాలులే : సమంత

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement