
నటుడు విజయ్ ఆంటోనితో జత కట్టడానికి జాతి రత్నాలు చిత్రం నాయకి ఫరియా అబ్దుల్లా సిద్ధమయ్యారు. సుశీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి వెల్లి మయిల్ అనే పేరు నిర్ణయించారు. సత్యరాజ్, దర్శకుడు భారతీరాజా తెలుగు నటుడు సునీల్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని నల్లుసామి పిక్చర్స్ పతాకంపై తాయ్ శరవణన్ నిర్మిస్తున్నా రు.
షూటింగ్ సోమవారం ఉదయం దిండిగల్ సమీపంలోని సూత్తంపూండి గ్రామంలోని శివాలయంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. రాష్ట్ర మంత్రి చక్రపాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇది 1980 కాలంలో సాగే చిత్రంగా ఇది ఉంటుందని దర్శకుడు తెలిపారు. చిత్రాన్ని తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో విడుదల చేయనున్నట్లు చెప్పారు. దీనికి డి.ఇమాన్ సంగీతాన్ని, విజయ్ కె.చక్రవర్తి చాయాగ్రహణం అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment