
సాక్షి, చెన్నై: తన సినీ ప్రస్థానంలో ముఖ్యమైన చిత్రం ‘వళ్లి మయిల్’ అని దర్శకుడు సుశీంద్రన్ అన్నారు. ఈయన దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ఇది. విజయ్ ఆంటోని, భారతీరాజా, సత్యరాజ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం ద్వారా జాతిరత్నాలు చిత్రం ఫేమ్ ఫరియా అబ్దుల్లా నాయికగా కోలీవుడ్‌కు పరిచయం అవుతుంది. తొలి చిత్రంలోనే టైటిల్ రోల్‌లో నటించే అవకాశాన్ని ఈ భామ దక్కించుకుంది. నల్లుసామి పిక్చర్స్ పతాకంపై తాయ్ సరవణన్ నిర్మిస్తున్న ఈ చిత్రం తొలి షెడ్యూల్ షూటింగ్‌ను పూర్తి చేసుకుని రెండో షెడ్యూల్ జరుపుకుంటోంది.
చదవండి: లండన్‌లో ఘనంగా హీరోయిన్ సీమంతం, ఫొటోలు వైరల్
కాగా మంగళవారం చెన్నైలో నిర్వహించిన చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదల కార్యక్రమంలో దర్శకుడు సుశీంద్రన్ మాట్లాడారు. ఇది పీరియాడికల్ కథా చిత్రంగా ఉంటుందన్నారు. ఈ కథను నాలుగేళ్లుగా రాస్తున్నానని చెప్పారు. విజయ్ ఆంటోని వంటి ప్రముఖ నటులతో పని చేయడం సంతోషంగా ఉందన్నారు. నటి ఫరియా అబ్దుల్లా టైటిల్ పాత్రలో చాలా చక్కగా నటిస్తున్నారని, ఆమెకు మంచి భవిష్యత్ ఉంటుందన్నారు. సంగీత దర్శకుడు డి.ఇమాన్ మంచి బాణీలు అందిస్తున్నారన్నారు. దీన్ని తమిళంతో పాటు అనేక భాషల్లో ఏక కాలంలో విడుదల చేయనున్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment