బిచ్చగాడు 2 : కొత్త అవతారమెత్తిన విజయ్‌ ఆంటోనీ | Vijay Antony To Director Bichagadu 2 Movie | Sakshi
Sakshi News home page

Bichagadu 2 : కొత్త అవతారమెత్తిన విజయ్‌ ఆంటోనీ

Published Sat, Jul 24 2021 2:26 PM | Last Updated on Sat, Jul 24 2021 2:26 PM

Vijay Antony To Director Bichagadu 2 Movie - Sakshi

విజయ్‌ ఆంటోనీ హీరోగా తెరకెక్కిన బిచ్చగాడు చిత్రం ఎంత సూపర్‌ హిట్‌ అయిందో అందరికి తెలిసిందే. తెలుగు నాట సైతం ఎన్నో రికార్డులను సృష్టించింది ఈ చిత్రం. ఒక డబ్బింగ్ సినిమా ఈ రేంజ్ లో రికార్డులు సృష్టించడం అంటే మాములు విషయం కాదు. ఇప్పుడు ‘బిచ్చగాడు’చిత్రానికి కొనసాగింపుగా బిచ్చగాడు 2  సినిమా ని విజయ్‌ ఆంటోనీ తన స్వీయ దర్శకత్వంలో నటిస్తున్నాడు.

ఇప్పటివరకు సంగీత దర్శకుడిగా, ఎడిటర్ గా, హీరోగా విజయవంతం అయినా విజయ్ ఆంటోనీ దర్శకుడిగా మెప్పించనున్నాడు. త్వరలోనే ఈ సినిమా కి సంబందించిన పూర్తి వివరాలు వెలువడనున్నాయి. తొలి భాగాన్ని తెరకెక్కించిన విజయ్ ఆంటోనీ ఫిల్మ్‌ కార్పొరేషన్‌ సంస్థే ఈ చిత్రాన్నీ నిర్మిస్తుంది. ప్రముఖ రచయిత భాష్య శ్రీ ఈ సినిమా కి మాటలు అందిస్తున్నారు.

ఇక ఈరోజు విజయ్ ఆంటోనీ పుట్టిన రోజు కావడంతో ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తూ ఈ చిత్రానికి సంబందించిన లుక్ ని విడుదల చేసింది చిత్ర బృందం. ఆయనను దర్శకుడిగా అనౌన్స్ చేస్తూ ప్రముఖ దర్శకుడు మురుగదాస్ ఈ చిత్ర పోస్టర్ ను విడుదల చేశాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement